Finance Minister Buggana: వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్ ఏపీని అప్పుల కుప్పగా మార్చిందంటూ విపక్షాలు చేస్తున్న కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి.. రాష్ట్రం అప్పుల్లో ఉండటానికి ప్రధాన కారణం చంద్రబాబేనని ఆరోపించిన ఆయన.. ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలుతుందనే ఓపీఎస్ కేంద్రం వెనక్కి వెళ్లిందన్నారు. చంద్రబాబు.. రాష్ట్రం 13 లక్షల కోట్ల అప్పులు చేశాం అని వ్యాఖ్యలు చేశారు.. మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఆర్ధిక మంత్రి చంద్రబాబు ఏ ఆధారంతో ఈ లెక్కలు చెబుతున్నారు? ఇంకొకరు 10 లక్షల కోట్లు అంటారు.. మరోసారి ఏడు లక్షల కోట్లు అంటారు . ఈ లెక్కలు ఎవరిచ్చారు? అని ప్రశ్నించారు.
కోవిడ్ వల్ల రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు ఇబ్బంది అయ్యిందన్నది వాస్తవం అన్నారు బుగ్గన.. కానీ, పెండింగ్ బిల్స్ 1,90 వేల కోట్లు ఉన్నాయని ఎవరు చెప్పారు మీకు? అని ప్రశ్నించారు. ఆర్బీఐ విడుదల చేసిన డాక్యుమెంట్ లో 15 ఏళ్ల డేటా ఉంటుంది.. టీడీపీ హయాంలో వార్షిక అప్పు 22 శాతం ఉంటే.. మా ప్రభుత్వంలో 12 శాతమే అన్నారు. ఆర్బీఐ, ఆర్ధిక శాఖ, బ్యాంకులకు తెలియకుండా అప్పులు చేయటం సాధ్యం అవుతుందా? అని ప్రశ్నించారు. స్థూల ఉత్పత్తిపై టీడీపీ హయాంలో అప్పు 2,59,000 కోట్లు.. అంటే 7 శాతం నిష్పత్తి.. మా ప్రభుత్వంలో స్థూల ఉత్పత్తిలో 2,26,000 కోట్ల అప్పు.. నిష్పత్తిలో 5.6 శాతమే అన్నారు. మా ప్రభుత్వ హయాంలో స్థూల ఉత్పత్తి 10,84,000 కోట్లు.. టీడీపీ హయాంలో స్థూల ఉత్పత్తి 6,98,000 కోట్లు.. ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలు 2018-19లో రూ.44,86,000.. 2022-23లో పీఎఫ్ ఖాతాలు రూ.60,78,000.. మరి ఉద్యోగాలు పెరిగినట్లా కాదా? అని ప్రశ్నించారు.
రాయలసీమ వాళ్లు అమాయకులు, కర్నూలు వాళ్లు తిక్కోళ్లు అని చంద్రబాబు అనుకుంటున్నాడు.. అందుకే ఏది పడితే అది మాట్లాడుతున్నాడు అని మండిపడ్డారు మంత్రి బుగ్గన.. ఎమ్మెల్యేలకు పేర్లు పెడుతున్నాడు చంద్రబాబు .. ఆయన వయసుకు ఇలా పేర్లు పెట్టడం పద్ధతిగా ఉంటుందా? లోకేష్ ను రేలంగి అని అనలేమా? మా ఎమ్మెల్యేలు చంద్రబాబు కు పేర్లు పెట్టలేరా? అని ప్రశ్నించారు. మాకు సంస్కారం ఉంది కనుకే ఇటువంటి వ్యాఖ్యలు చేయటం లేదు.. రాష్ట్రంలో వైసీపీ మినహా అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. అధికారికం కోసం ఎన్నో వేషాలు వేశాడు చంద్రబాబు.. రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడు చంద్రబాబేనని ఫైర్ అయ్యారు. 2008లో తెలంగాణ ఏర్పాటుకు లేఖ రాశాడు చంద్రబాబు.. ఏపీకి స్పెషల్ క్యాటగిరీ స్టేటస్ పోవటానికి చంద్రబాబు కారణం కాదా? హోదా వద్దు ప్యాకేజీ చాలు అని ఎందుకు అన్నారు? అని నిలదీసిన ఆయన.. ప్రత్యేక ప్యాకేజీ కూడా సాధించుకోలేక పోయారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పు జనాభా ప్రకారం, ఆస్తులు లొకేషన్ బట్టి విభజన చేస్తే చంద్రబాబు ఎందుకు మాట్లాడ లేదు? అని అసహనం వ్యక్తం చేశారు బుగ్గన.. రాష్ట్రం అప్పుల్లో ఉండటానికి ప్రధాన కారణం చంద్రబాబేనన్న ఆయన… ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలుతుందనే ఓపీఎస్ కేంద్రం వెనక్కి వెళ్లిందన్నారు ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.