AP Excise Suraksha App: నకిలీ మద్యానికి చెక్ పెట్టేందుకు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ తీసుకువచ్చినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చిన సమస్యల్లో నకిలీ మద్యం ఒకటని అన్నారు. గత ప్రభుత్వం నకిలీ మద్యాన్ని ఏరులై పారించిందని, దానిని లీగలైజ్ చేసిందని విమర్శించారు. గత పాలకులు గంజాయిని వాణిజ్య పంటగా భావించి పండించారు, సరఫరా చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వ్యవస్థలను ప్రక్షాళన చేయడం ప్రారంభించిందని చెప్పారు.
READ ALSO: Breakfast Importance: ఉదయం టిఫిన్‌కు బరువు పెరగడానికి సంబంధం ఏమిటి?
గత ప్రభుత్వంలోని పెద్దలు తమకు సంబంధించిన మనుషులకు చెందిన కంపెనీల బ్రాండ్లనే అమ్మారని అన్నారు. బలవంతంగా డిస్టలరీలు హ్యండోవర్ చేసుకున్నారని, ఏకంగా ఓ నేర సామ్రాజ్యాన్ని సృష్టించారని విమర్శించారు. గత ప్రభుత్వంలో జరిగిన మద్యం దోపిడీపై సిట్ ఏర్పాటు చేశాం, ప్రస్తుతం దానిపై విచారణ జరగుతోందని చెప్పారు. మద్యం విషయంలో ఇంకా కొందరు కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని, నేరాలు చేయడం, వాటిని ఎదుటి వారిపై మోపి తప్పించుకునే ప్రయత్నం చేయడం లాంటివి చేస్తున్నారని చెప్పారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు వారిని కచ్చితంగా కంట్రోల్లో పెడతామని స్పష్టం చేశారు.
గత పాలనలో నాణ్యమైన మద్యం లేకపోవడం, ధరలు విపరీతంగా ఉండడంతో పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం దిగుమతి అయ్యేదని చెప్పారు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారిందని అన్నారు. గత పాలకులు అన్ని వాళ్ల సొంత బ్రాండ్లనే లీగల్ చేశారు, ట్రాన్స్‌పోర్ట్ కూడా సొంత వాళ్లకు ఇచ్చారు, ఇల్లీగల్ నేర సామ్రాజ్యం ఏర్పాటు చేశారని అన్నారు. ఇప్పుడు దానిని పూర్తిగా కంట్రోల్లో పెట్టామని, రాష్ట్రంలో బెస్ట్ మద్యం పాలసీ తెచ్చామని సీఎం చెప్పారు. ఇకపై రాష్ట్రంలో నకిలీ మద్యానికి చెక్ పెట్టేందుకు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ తీసుకువచ్చినట్లు స్పష్టం చేశారు.
READ ALSO: Bihar Elections: ఎన్డీయే కూటమిలో తేలిన సీట్ల లెక్కలు.. ఎవరికి ఎన్ని సీట్లు అంటే..
