Site icon NTV Telugu

AP Excise Dept: కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదలకు ఎక్సైజ్ శాఖ కసరత్తు

Ap Liquor Scam

Ap Liquor Scam

AP Excise Dept: ఏపీలో కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదలకు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తోంది. రెండు, మూడు రోజుల్లోగా నోటిఫికేషన్ జారీ చేసేలా చర్యలు చేపడుతోంది. మద్యం దుకాణాలు ప్రభుత్వమే నడిపేలా గత ప్రభుత్వం చట్టం చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ చేసిన చట్టాన్ని సవరించి ఆర్డినెన్స్ తెచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆర్డినెన్స్ ఆమోదం కోసం సవరణ బిల్లును గవర్నర్ వద్దకు ప్రభుత్వం పంపనుంది. ఇవాళ లేదా రేపటిలోగా ఆర్డినెన్సును గవర్నర్ ఆమోదించనున్నారు. మొత్తం 3736 మద్యం షాపుల కేటాయింపునకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

Read Also: Andhra Pradesh: ఏపీలో నలుగురు ఐఏఎస్ అధికారులకు అదనపు బాధ్యతలు

ఇందులో 340 షాపులను కల్లు గీత వృత్తి కులాలకు సర్కార్ రిజర్వ్ చేయనుంది. రిజర్వేషన్ల కోటాలోని షాపులను ఎక్కడెక్కడ కేటాయించాలన్న అంశం పైనా అబ్కారీ శాఖ కసరత్తు చేస్తోంది. కల్లు గీత వృత్తి కులాల జనాభా ఏయే జిల్లాల్లో.. ఏయే నియోజకవర్గాల్లో ఎంత మేరకు ఉన్నారనే అంశంపై ఆరా తీస్తోంది. వివరాలను బీసీ సంక్షేమ శాఖ నుంచి ఎక్సైజ్ శాఖ తీసుకుంటోంది. కల్లు గీత వృత్తి కులాల జనాభా ప్రాతిపదికనే మద్యం షాపులను ఎక్సైజ్ శాఖ రిజర్వ్ చేయనుంది.

Exit mobile version