Site icon NTV Telugu

AP Elections Results 2024: ఓటమి దిశగా వైసీపీ కీలక నేతలు!

Ycp

Ycp

YCP Leaders Defeat in AP Elections Results 2024: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు ఓటమి దిశగా అడుగులు వేస్తున్నారు. ఎన్డీఏ కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ధాటికి వైసీపీ కీలక నేతలు కూడా ఓటమి దిశగా సాగుతున్నారు. బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, బుగ్గన రాజేంద్రనాథ్‌, గుడివాడ అమర్నాథ్‌, ఆర్కే రోజా, కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, అంబటి రాంబాబులు వెనకంజలో ఉన్నారు.

విడదల రజిని, అంజాద్‌ బాషా, ఉషశ్రీ చరణ్‌, జోగి ర‌మేశ్, రాజన్న దొర, కొట్టు సత్యనారాయణ, దాడిశెట్టి రాజా, ఆదిమూలపు సురేష్‌, మేరుగు నాగార్జున సహా పలువురు కీలక నేతలు వెనుకంజలో కొనసాగుతున్నారు. 175 సీట్లకు గాను కేవలం 12 సీట్ల ఆదిక్యంలోనే వైసీపీ ఉంది. ప్రతిపక్షంలో ఉండాలంటే 18 సీట్లు అసవరం అన్న విషయం తెలిసిందే.

Exit mobile version