Chandrababu Naidu-Ram Charan: చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన రామ్ చరణ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan wishes to Chandrababu Naidu: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి రికార్డు విజయం సాధించిన విషయం తెలిసిందే. కూటమి విజయంపై టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టీడీపీ అధినేత చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఏపీ ఎన్నికల్లో సంచలన విజయంతో చరిత్ర సృష్టించిన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు’ అని చరణ్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయంపై మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే స్పందించారు. తన సోదరుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ప్రత్యేక అభినందలు తెలిపారు. నిన్ను చూస్తుంటే ఓ అన్నగా గర్వంగా ఉందని, నువ్వు గేమ్ ఛేంజర్ మాత్రమే కాదు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అని అందరూ కొనియాడుతుంటే హృదయం ఉప్పొంగుతోందన్నారు. ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని, విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా అని చిరు పేర్కొన్నారు. మరోవైపు చంద్రబాబుకు కూడా చిరు శుభాకాంక్షలు తెలిపారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
Also Read: Balagam Mogilaiah: ‘బలగం’ మొగిలయ్యకు మరోసారి తీవ్ర అస్వస్థత.. ఆదుకోవాలని భార్య కన్నీరు!
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 175 అసెంబ్లీ సీట్లకు గాను.. కూటమి 164 సీట్లను గెలుచుకుని బంపర్ విక్టరీ నమోదు చేసింది. టీడీపీ మొత్తం 144 స్థానాల్లో పోటీ చేయగా.. 135 స్థానాల్లో గెలిచింది. జనసేన 21కి 21 స్థానాలు గెలుపొందింది. బీజేపీ 10 చోట్ల పోటీ చేయగా.. 8 సీట్లలో విజయం అందుకుంది. ఇక అధికార వైసీపీ 175 సీట్లకు గాను కేవలం 11 స్థానాలతోనే సరిపెట్టుకుంది. జూన్ 9న సీఎంగా నాలుగోసారి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!