Nandyal District: ఆస్తుల కోసం కొట్టుకుని చచ్చే ఈరోజుల్లో ఓ వృద్ధ దంపతులు వినూత్నంగా ఆలోచించారు. రామాలయానికి తమ ఆస్తిని మొత్తం విరాళంగా అందజేసి ఔదార్యాన్ని చాటుకున్నారు. ఏపీలోని నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామానికి చెందిన బొచ్చు పెద్ద వీర భద్రుడు, వెంకటేశ్వరమ్మ దంపతులు. వీరికి రూ.2 కోట్లు విలువైన 8 ఎకరాల తోట ఉంది. కానీ.. ఈ వృద్ధ దంపతులకు సంతానం లేదు. దీంతో వారికి ఉన్న ఆస్తి మొత్తాన్ని మాధవరం రామాలయానికి విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు గ్రామ పెద్దల సమక్షంలో ఆస్తికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఆ వృద్ధ దంపతులను ఘనంగా సన్మానించారు. ఊర్లో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
READ MORE: Ghaziabad: ఇష్టం లేని పెళ్లి.. ఏడాది గడవక ముందే.. భర్త నాలుక కొరికిన భార్య.. అసలు ఏం జరిగిందంటే?
