Site icon NTV Telugu

AP DSC Notification 2024: బ్రేకింగ్‌: డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల

Botsa

Botsa

AP DSC Notification 2024: ఎంతో కాలంగా డీఎస్సీ కోసం ఎదురుచూస్తోన్న నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఈ రోజు డీఎస్సీ 2024 నోటిఫికేషన్‌ విడుదల చేశారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. 6,100 టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.. ఈ నెల 12వ తేదీ నుంచి డీఎస్సీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని.. ఏప్రిల్‌ 7వ తేదీన ఫలితాలు ప్రకటిస్తామని వెల్లడించారు. 6,100 ఉపాధ్యాయుల పోస్టుల్లో 2,299 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉండగా.. 2,280 ఎస్‌జీటీ పోస్టులు, 42 ప్రిన్సిపల్‌ పోస్టులు, 1,264 టీజీజీ పోస్టులు, 215 పీజీటీ పోస్టులు ఉన్నాయి..

Read Also:PM Modi: “కాంగ్రెస్‌ 40 సీట్లు దాటదు”.. రాజ్యసభలో పీఎం మోడీ విమర్శలు..

ఈ రోజు సచివాలయంలో మీడియాతో మాట్లాడిన విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. డీఎస్సీ -2024ను ప్రకటిస్తున్నాం.. ఈ నెల 12వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు.. ఈ నెల 12వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరణ ఉంటుందన్నారు. మార్చి 5వ తేదీ నుంచి హాట్‌టికెట్లు డౌల్‌నోడ్‌ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.. ఇక, మార్చి 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి 31వ తేదీన ప్రాథమిక కీ విడుదల చేస్తాం.. ఏప్రిల్‌ 7వ తేదీన ఫలితాలు ప్రకటిస్తామని వెల్లడించారు మంత్రి బొత్స సత్యనారాయణ. మరోవైపు, రేపటి నుంచి టెట్ పరీక్షల షెడ్యూల్ ప్రారంభం అవుతుందన్నారు.. మొత్తంగా ఏడు రకాల మేనేజ్మెంట్ పాఠశాల పరిధిలో 6,100 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నాం అని వెల్లడించారు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.

Exit mobile version