Site icon NTV Telugu

AP DSC Notification 2024: డీఎస్సీపై ఓ నిర్ణయానికి వచ్చిన ఏపీ ప్రభుత్వం..! రేపే నోటిఫికేషన్..!

Ap Dsc

Ap Dsc

AP DSC Notification 2024: ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నిర్వహణపై ఓ నిర్ణయానికి వచ్చింది ప్రభుత్వం.. సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన గత వారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో డీఎస్సీకి ఆమోద ముద్ర పడింది.. 6,100 పోస్టులను భర్తీ చేయడానికి మెగా డీఎస్సీ-2024 నోటిషికేషన్ విడుదలకు కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇక, ఇప్పుడు డీఎస్సీ నోటిఫికేషన్ పై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.. ఈ రోజు ఉదయం విద్యాశాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. డీఎస్సీ-2024 నోటిఫికేషన్‌పై విధివిధానాలను ఖరారు చేశారు. రేపు 6,100 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది..

Read Also: Iran: భారతీయు టూరిస్టులకు ఇరాన్ శుభవార్త.. ఇకపై వీసా లేకుండానే వెళ్లొచ్చు

ఇవాళ ఉదయం విద్యా శాఖ అధికారులతో సమావేశం అయిన మంత్రి బొత్స సత్యనారాయణ.. 6,100 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ప్రకటన, విధివిధానాల ఖరారుపై చర్చించారు. ఈ సమావేశంలో పోస్టులు ఖాళీలు, విధివిధానాలు, తేదీలు, ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేయాలని, ఎప్పటిలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలనే విషయాలపై కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇక, రేపు డీఎస్సీ -2024 నోటిఫికేషన్ విడుదల చేస్తారని చెబుతున్నారు. కాగా, డీఎస్సీ నోటిఫికేషన్‌ కోసం ఎంతో కాలంగా నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు.. త్వరలోనే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మెగా డీఎస్సీకి ఏపీ కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.. 6,100 పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీతో పాటు టెట్ కూడా నిర్వహించడానికి ఏపీ కేబినెట్‌ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.

Exit mobile version