NTV Telugu Site icon

MP Family Kidnap: వైజాగ్ ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్‌ కేసు.. కీలక విషయాలు వెల్లడించిన డీజీపీ

Ap Dgp

Ap Dgp

MP Family Kidnap Case: విశాఖలో వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్.. నగరంలో కలకలం రేగింది. ఆడిటర్‌ గన్నమనేని వెంకటేశ్వరరావు కిడ్నాప్‌ అయ్యారంటూ ఎంపీ సత్యనారాయణ.. విశాఖ పోలీసులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. రెండు రోజులుగా ఫోన్‌ చేస్తున్నా ఆడిటర్‌ స్పందించడం లేదని.. తనకేదో అనుమానంగా ఉందని ఎంపీ ఫిర్యాదు చేసినట్లు డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి చెప్పారు. ఎంపీ ఫిర్యాదుతో ఆడిటర్‌కు ఫోన్‌ చేయగా.. తాను శ్రీకాకుళంలో ఉన్నట్లు చెప్పారని.. కానీ లోకేషన్‌ మాత్రం విశాఖలోనే చూపిస్తోందని డీజీపీ వెల్లడించారు. దీంతో కిడ్నాప్‌ నిజమేనని తేలిందన్నారు. పోలీసులకు సమాచారం అందగానే ఆడిటర్‌ గన్నమనేని వెంకటేశ్వరరావును ట్రేస్‌ చేసినట్లు చెప్పారు.

Also Read: Srisailam: శ్రీశైలం మల్లన్న భక్తులకు వడ ప్రసాదం అందుబాటులోకి తెచ్చిన దేవస్థానం

అయితే.. పోలీసులకు సమాచారం అందిందని తెలుసుకున్న కిడ్నాపర్లు ఎంపీ సతీమణి జ్యోతి, కుమారుడు శరత్‌చంద్ర, ఆడిటర్‌ గన్నమనేని వెంకటేశ్వరరావును కారులో తీసుకుని పారిపోయేందుకు ప్రయత్నించారని.. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ద్వారా నిందితులను వెంబడించి పట్టుకున్నామని డీజీపీ వివరించారు. పోలీసులు తనిఖీలతో ఓ ఆడి కారులో ఎంపీ భార్య, కుమారుడు, ఆడిటర్ జీవీని తీసుకుని వెళ్లే ప్రయత్నం చేశారని.. పోలీసులు వెంటాడితే కారులో వారిని వదిలేశారని డీజీపీ తెలిపారు. రెండు రోజుల్లో ముగ్గుర్ని కిడ్నాప్ చేశారని ఆయన పేర్కొన్నారు.

Also Read: Sukesh Chandrashekhar: జైలు నుంచే రూ.10 కోట్ల విరాళం.. ఒడిశా రైలు ప్రమాద బాధితులకు సాయం…

హేమంత్, రాజేష్, సాయి నిందితులంటూ డీజీపీ వివరించారు. రూ. 1.75 కోట్లు కిడ్నాపర్లు తీసుకున్నారని.. వీరి వద్ద నుంచి రూ. 86.50 లక్షలను రికవరీ చేశామన్నారు. కిడ్నాపర్లకు మరో ముగ్గురు సహకరించారు.. వారు పరారీలో ఉన్నారన్నారు.ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ ఘటనలో పోలీసులు సమర్థవంతంగా వ్యవహరించారని డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న నేరాలపై డీజీపీ రాజేంద్రనాథ్​ రెడ్డి మాట్లాడారు. విశాఖలో క్రైమ్ పెరిగిందని.. శాంతి భద్రతల్లో లోపాలున్నాయని విమర్శించడం సరికాదన్నారు. పోలీసులు అలెర్ట్‌గా ఉన్నారు కాబట్టే గంటల వ్యవధిలో పట్టుకోగలిగామన్నారు. ల్యాండ్ గ్రాబింగ్ కేసులను వెంటనే పరిష్కరిస్తున్నామని డీజీపీ తెలిపారు.