ఏపీలో ఇప్పుడు జీవో నెంబర్ 1 పై రచ్చ సాగుతోంది. అయితే ఈ జీవోపై క్లారిటీ ఇచ్చారు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. జీవో నెంబర్ 1 బేస్ చేసుకుని ఎవ్వరినీ బ్యాన్ చేయడం లేదనీ, జీవో నెంబర్ 1 గురించి ఎవరూ ఆందోళన పడనవసరం లేదని అన్నారు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పోలీసుల జిల్లా రివ్యూ మీటింగ్ కు హాజరయ్యారు డీజీపీ రాజేంద్రనాద్ రెడ్డి. జీవో నెంబర్ 1 బేస్ చేసుకుని ఎవ్వరినీ బ్యాన్ చేయడం లేదన్నారు. జీవో నెంబర్ 1 గురించి ఎవరూ ఆందోళన పడనవసరం లేదన్నారు.
Read Also: Heavy Weight Girl: వయసు 5ఏళ్లు.. బరువు 45కిలోలు.. తిండి పెట్టలేక తాళం
ఎక్కడా మేము ఎవరినీ బ్లాక్ చేయడం లేదని అన్నారు డిజిపి. జీవో వచ్చిన తరువాత కూడా పొలిటికల్ పార్టీల మీటింగులకు అనుమతులు ఇచ్చాం అన్నారు. ఎవరైనా పాదయాత్ర చేయాలంటే జిల్లా హెడ్ క్వార్టర్స్ లో అనుమతి తీసుకోవాలని డీజీపీ అన్నారు. రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా ఇరవై ఐదు ఏళ్ళ నుండి నడుస్తుందనీ, లాస్ట్ ఇయర్ నుండి గంజాయి నాశనం చేస్తున్నామని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న గంజాయి సాగును అక్కడ వాళ్ళు ధ్వంసం చేయాలని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు.
Read Also: Ratha Saptami Tirumala Special Live: రథసప్తమి సూర్యజయంతి వేళ సర్వభూపాల వాహనంపై శ్రీవారు