పోలీసులు సంక్షేమం కోసమే పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తున్నామని ఏపీ డీజీపీ ద్వారక తిరుమల రావు అన్నారు. నాన్ పోలీసుల సంక్షేమానికి కూడా తోడ్పాటుగా ఉంటుందన్నారు. పోలీస్ పెట్రోల్ బంక్‌లో ఖచ్చితమైన నాణ్యత ప్రమాణాలు ఉంటాయని, ప్రజలు ఈ బంకుల్లో పెట్రోల్ కొట్టించుకొని పోలీస్ శాఖకు సహకరించాలని డీజీపీ కోరారు. ఈరోజు రాజమహేంద్రవరంలో పెట్రోల్ బంక్‌ను ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రారంభించారు. లాలా చెరువు సమీపంలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు అయింది.
Also Read: Kapu Reservation: సీఎం, డిప్యూటీ సీఎంలకు హరిరామ జోగయ్య బహిరంగ లేఖ!
పెట్రోల్ బంక్ ప్రారంభం అనంతరం డీజీపీ ద్వారక తిరుమల రావు మాట్లాడుతూ… ‘డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటిపై డ్రోన్ ఎగురవేసిన ఘటనపై విచారణ కొనసాగుతుంది. నిన్న సాయంత్రానికే విచారణ పూర్తి కావాల్సింది. మరో రోజు అదనంగా విచారణకు సమయం కోరారు. విజయనగరం జిల్లా ఏజెన్సీలో పవన్ కళ్యాణ్ పర్యటనలో నకిలీ పోలీసు అధికారి, ఇంటిపై డ్రోన్ ఘటనలను వేరువేరుగా చూస్తున్నాం. గతం కంటే ఈసారి సంక్రాంతికి కోడి పందాలు ఎక్కువగా జరిగిన విషయం నా దృష్టికి రాలేదు. కోడి పందాలకు సంబంధించి కేసులు అయితే ఎక్కువగానే నమోదు చేశాం. పోలీసులు సంక్షేమం కోసమే పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తున్నాం. నాన్ పోలీసులు కూడా సంక్షేమానికి తోడ్పాటుగా ఉంటుంది. పోలీస్ పెట్రోల్ బంక్‌లో ఖచ్చితమైన నాణ్యత ప్రమాణాలు ఉంటాయి. ప్రజలు ఈ బంకుల్లో పెట్రోల్ కొట్టించుకొని పోలీస్ శాఖకు సహకరించండి’ అని కోరారు.