NTV Telugu Site icon

Deputy CM Pawan Kalyan: పీసీబీ ఫైల్స్, రిపోర్టుల దగ్ధం.. డిప్యూటీ సీఎం పవన్‌ సీరియస్‌..

Pawan

Pawan

Deputy CM Pawan Kalyan: కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఫైల్స్, రిపోర్టుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఆరా తీశారు.. కాలుష్య నియంత్రణ మండలికి సంబంధించిన ఫైల్స్, రిపోర్టులను కృష్ణా నది కరకట్టపై దగ్ధం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. దగ్ధం చేసిన ఫైల్స్, రిపోర్టులకు సంబంధించిన వివరాలను తక్షణమే అందించాలని ఆదేశించారు.. ఈ దగ్ధం వెనక ఎవరెవరు ఉన్నారు అని ఆరా తీసిన పవన్. ఇందుకు బాధ్యులైన వారిపై చట్టప్రకారం చర్యలకు ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు.. అసలు, పీసీబీ కార్యాలయాల్లో ఫైల్స్, రిపోర్టులు ఏ మేరకు భద్రంగా ఉన్నాయి.. భద్రపరచేందుకు అనుసరిస్తున్న విధానాలు ఏమిటో వెల్లడించాలని ఆధికారులకు ఆదేశించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.

Read Also: Heavy rainfall: హిమాచల్‌ప్రదేశ్‌లో అతి భారీ వర్షాలు.. 115 రోడ్లు మూసివేత

అయితే, ఎక్సైజ్ శాఖలో పీసీబీ ఫైల్స్ దగ్ధం ఘటన సంచలనంగా మారింది.. సమీర్ శర్మ ఓఎస్డీ రామారావు పాత్ర ఉండడంతో ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల్లో చర్చ మొదలైంది.. ఎక్సైజ్ శాఖలో సుదీర్ఘ కాలం పని చేశారు రామారావు. ఓఎస్డీ రామారావు గురించి వెలుగులోకి ఆసక్తికర వ్యవహారాలు వస్తున్నాయి.. కొత్త ప్రభుత్వంలోని ముఖ్యులకు తాను ఓఎస్డీగా వెళ్తానంటూ గత కొంత కాలంగా రామారావు ప్రచారం చేసుకున్నారట.. పీసీబీపై రివ్యూ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో తానున్న ఫొటోను తన సన్నిహితుల గ్రూపుల్లో పెట్టారట రామారావు. అంతేకాదు.. పవన్ సహా ఇంకొందరు మంత్రులకు తాను సన్నిహితమని ప్రచారం చేసుకుంటున్నారని ఎక్సైజ్ శాఖలో చర్చ సాగింది.. ముఖ్యుల తెర వెనుక వ్యవహారాలను చక్కబెట్టడంలో రామారావు దిట్ట అని ఎక్సైజ్ శాఖ వర్గాలు చర్చించుకుంటున్నాయి.. ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల బదిలీలు.. ఆర్వోఆర్ విషయాల్లో భారీ అక్రమాలకు తెర తీశారని రామారావుపై అభియోగాలు ఉన్నాయి. 2014-19 మధ్య కాలంలో రామారావు అక్రమాలపై నాటి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారట అప్పటి మంత్రి జవహర్.. పట్టుబట్టి రామారావును అప్పట్లో బదిలీ చేయించారట.. మళ్లీ ఇప్పుడు ఫైళ్ల దగ్దం ఘటనలో రామారావు పేరు రావడంపై ఎక్సైజ్ శాఖలో ఆసక్తికర చర్చ సాగుతోంది.