ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు తమిళనాడులో పర్యటించనున్న విషయం తెలిసిందే. మురుగ భక్తర్గళ్ మానాడులో పాల్గొనేందుకు కాసేపటి క్రితం ప్రత్యేక విమానంలో మధురై చేరుకున్నారు. మధురై విమానాశ్రయంలో పవన్‌కి బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులు నైనార్ నాగేంద్రన్, తమిళనాడు అబ్జర్వర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, తమిళనాడు బీజేపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. తిరుపర కుండ్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం.. అమ్మ తిడల్ ప్రాంగణంలో జరగనున్న మానాడులో ముఖ్య అతిథిగా పవన్ పాల్గొంటారు.
Also Read: Eluru-SAI: మహిళా క్రీడాకారిణులపై లైంగిక వేధింపులు.. నిజమే అని తేల్చిన అధికారులు!
పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి మధురై వెళ్లాల్సిన ప్రత్యేక విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. మధ్యాహ్నం 12.30 మధురై చేరుకోవాల్సిన పవన్.. గంట ఆలస్యంగా వెళ్లారు. ఈరోజు సాయంత్రం లక్షలాది మంది సుబ్రమణ్యస్వామి భక్తులతో, మురుగన్‌కు నెలవైన తమిళనాడు రాష్ట్రంలో, మీనాక్షి అమ్మవారు కొలువైన మధురై నగరంలో జరగనున్న మురుగ భక్తర్గల్ మానాడు కార్యక్రమంలో పాల్గొనేందుకు పవన్ సంప్రదాయ దుస్తులు ధరించారు. పంచెకట్టులో పవన్ మధురై చేరుకున్నారు.
