NTV Telugu Site icon

Pawan Kalyan: సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కును అందించిన పవన్‌కల్యాణ్

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణానికి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. అక్కడ ఏర్పాటు చేసిన వినాయకుడి పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్ భేటీ అయ్యారు. వరద బాధితులకు చేస్తానన్న సాయం కోటి రూపాయల చెక్కును సీఎం చంద్రబాబుకు అందజేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు.

Read Also: CM Chandrababu: వరద సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

అనంతరం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి పూజలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. మట్టి గణపతి ప్రతిమకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పూజలు చేశారు. విఘ్నాలు లేకుండా రాష్ట్రాభివృద్ధికి దైవం ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడి కరుణాకటాక్షాలతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో గడపాలని, విజయాలు సిద్ధించాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యే పిడుగు హరిప్రసాద్, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ కన్వీనర్ కళ్యాణం శివ శ్రీనివాస్, చేనేత వికాస విభాగం ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Show comments