NTV Telugu Site icon

Deputy CM Pawan Kalyan: వరల్డ్‌ బ్యాంక్ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం పవన్‌ భేటీ..

Pawan

Pawan

Deputy CM Pawan Kalyan: ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో సమావేశం అయ్యారు ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌.. ఇంటింటికీ కుళాయి ద్వారా రక్షిత మంచి నీరు సరఫరాపై చర్చించారు.. ఇంటింటికి మంచి నీరు అందించే ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు నుంచి ఏ మేరకు నిధులివ్వగలరన్న అంశంపై ప్రధానంగా చర్చ సాగింది.. గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత నీరు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్టు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులకు తెలిపారు పవన్‌.. గత ప్రభుత్వం తరహాలో నిధులను పక్క దారి మళ్లించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

Read Also: Nimmala ramanaidu: ఉచిత ఇసుక, తల్లికి వందనంపై విష ప్రచారం.. మండిపడ్డ మంత్రి

ఇంటింటికీ కుళాయి ద్వారా రక్షిత మంచి నీరు సరఫరా చేయడం లక్ష్యంగా.. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో మంగళగిరిలోని తన నివాసంలో సమావేశం అయ్యారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్.. ప్రతి ఇంటికీ రక్షిత మంచినీరు అందించాలన్న లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు గల అవకాశాలపై గ్రామీణ నీటి సరఫరాశాఖ మంత్రి హోదాలో సుదీర్ఘంగా వరల్డ్‌ బ్యాంక్‌ ప్రతినిధులతో చర్చించారు. ఈ సమావేశంలో పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్, ప్రపంచ బ్యాంక్ జలవనరుల విభాగం సలహాదారు రమేష్ ముకల్లా, మాథ్యూస్ ముల్లికల్ పాల్గొన్నారు. కాగా, కీలక శాఖల బాధ్యతలు తీసుకున్న పవన్‌ కల్యాణ్‌.. వరుసగా రివ్యూలు నిర్వహిస్తూ.. తాము ఇచ్చిన హామీలు.. తన లక్ష్యాలకు అనుగుణంగా.. ఆయా శాఖలను పనిలోదించే పనిలో ఉన్నారు..

Show comments