NTV Telugu Site icon

Pawan Kalyan: నేడు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం.. అంజన్నను దర్శించుకోనున్న పవన్ కళ్యాణ్

Deputy Cm Pawan Kalyan

Deputy Cm Pawan Kalyan

నేడు కొండగట్టు అంజన్నను ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి కొండగట్టుకు వస్తున్నారు పవన్ కళ్యాణ్. ఉదయం హైదరాబాద్ నుండి రోడ్డు మార్గంలో కొండగట్టుకు చేరుకోనున్నారు. తమ ఇలవేల్పు కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించిన అనంతరం తిరిగి హైదరాబాద్ వెళ్లనున్నారు. పవన్ కల్యాణ్ ఒక్కరే కాదు మెగా ఫ్యామిలీ మొత్తం ఆంజనేయ స్వామిని ఇష్టంగా కొలుస్తారు. ప్రజారాజ్యం 2009 ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ కు కొండగట్టు సమీపంలో ప్రమాదం తప్పిన సంగతి తెలిసిందే. హైటెన్షన్ వైర్లు పడటం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. అప్పటి నుంచి కొండగట్టు అంజన్నను పవన్ కల్యాణ్ ఇష్ట దైవంగా ఆరాధిస్తున్నారు. ఏ మంచి పని చేపట్టినా ముందుగా కొండగట్టు వెళుతుంటారు. గత ఎన్నికల్లో ప్రచారం కోసం పవన్ కల్యాణ్ వారాహి అనే ప్రత్యేక వాహనాన్ని ఉపయోగించారు. ఆ వాహనానికి తొలి పూజ కొండగట్టు అంజన్న ఆలయంలో నిర్వహించారు.

Read Also: Bihar : బీహార్ లోని మధుబనిలో కూలిన వంతెన.. 10రోజుల వ్యవధిలోనే ఐదో ఘటన

ఎన్నికల ముందు వారాహి వాహనానికి పవన్ కళ్యాణ్ కొండగట్టులోనే పూజలు నిర్వహించారు. జనసేన అధినేతకు భారీ స్వాగత ఏర్పాట్లు చేసింది తెలంగాణ జనసేన విభాగం. మరోవైపు.. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొండగట్టు అంజన్న ఆశీస్సులతో తమకు మంచి జరిగిందని పవన్ కల్యాణ్ మరోసారి శనివారం కొండగట్టు పర్యటనకు వస్తున్నట్లు జనసేన పార్టీ శ్రేణులు తెలిపారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అఖండ విజయం సాధించింది. కూటమి విజయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రధాన పాత్ర పోషించారు.

Read Also: Breaking: కాంగ్రెస్ నేత డి.శ్రీనివాస్ కన్నుమూత..