ఉత్తరాంధ్రకు వాయుగుండం ముప్పు పొంచి ఉంది. మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఈరోజు రాత్రికి వాయుగుండంగా బలపడుతుంది. రేపు ఉదయం దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటుతుందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. తీరం వెంబడి 50 నుంచి 60 కిమీ గరిష్ఠ వేగంతో ఈదురుగాలు వీస్తుండగా.. సముద్రం అలజడిగా మారింది. వాయుగుండం ప్రభావంతో రాగల 48 గంటలు ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి.
Also Read: Mahesh Kumar Goud: అక్టోబర్ నెలాఖరు వరకు పూర్తికానున్న డీసీసీ అధ్యక్షుల నియామకాలు!
నెల్లూరు, తిరుపతి మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం చెప్పింది. ఇప్పటికే వాయుగుండం ప్రభావం ఉత్తరాంధ్ర మీద మొదలైంది. 9 జిల్లాలలో ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ జిల్లాల్లో 10 నుంచి 20 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అవుతుంది. ఇవాళ, రేపు ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. ఐదు రోజులు పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.
9 జిల్లాలకు ఆరెంజ్ బులెటిన్ హెచ్చరికలు జారీ అయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, ఎన్టిఆర్, ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అల్లూరి, కాకినాడ, పశ్చిమగోదావరి, కోనసీమ,కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. రేపు శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి, ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్టిఆర్, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు.
