NTV Telugu Site icon

Pensions Distribution: కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్.. పెన్షన్ల పంపిణీపై కీలక ఆదేశాలు

Ap Cs

Ap Cs

Pensions Distribution: రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్.. జులై ఒకటో తేదీన ఉదయం 6 గంటల నుండి పెన్షన్ల పంపిణీ మొదలు పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు.. ఇంటింటికి గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగులు వెళ్లి పెన్షన్ పంపిణీ చేయాలని స్పష్టం చేశారు.. పెన్షన్ల పంపిణీ నిమిత్తం ఒక్కొక్క ఉద్యోగికి 50 ఇళ్లు కేటాయించాం.. అదనంగా ఉద్యోగులు అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే వినియోగించాలని క్లారిటీ ఇచ్చారు. మొత్తం నాలుగు రకాల క్యాటగిరీల పింఛను దారులు ఉన్నారు.. 11 సబ్ క్యాటగిరీలకు చెందిన పెన్షన్ దారులకు మొత్తం రూ.7000 పెన్షన్‌ అందించాలని ఆదేశాలు జారీ చేశారు సీఎస్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్.

Read Also: CS Nirab Kumar Prasad: సీఎస్ పదవీ కాలం పొడిగింపు.. మరో 6 నెలలకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్

కాగా, సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రోజు పింఛన్‌దారులకు శుభవార్త చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. సూపర్ – 6లో భాగంగా హామీ ఇచ్చినట్లే పింఛన్ పెంచి ఇవ్వనున్నారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన సమయంలో.. పెన్షన్ల పెంపు ఫైల్‌పై సంతకం చేసిన విషయం తెలిసిందే. దీంతో, గత ప్రభుత్వంలో ఇచ్చిన పెన్షన్ కంటే అదనంగా పెన్షన్‌ అందనుంది.. గత సర్కార్‌లో కంటే.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పెన్షన్‌ పెంచింది.. దీంతో.. ఇప్పుడు నెలవారి పెన్షన్‌ రూ.4 వేలు.. గత మూడు నెలల పెంపు రూ.3000 కలిపి మొత్తం రూ.7000 పింఛన్.. ఎన్టీఆర్ భరోసా పేరుతో జులై 1వ తేదీ నుంచి ఇంటి వద్దే అందించబోతున్నారు.