Site icon NTV Telugu

Jawahar Reddy: సెలవుపై వెళ్లిన సీఎస్‌ జవహర్‌రెడ్డి..!

Jawahar Reddy

Jawahar Reddy

Jawahar Reddy: ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో గ్రాండ్‌ విక్టరీ కొట్టింది టీడీపీ కూటమి.. ఇక, అధికారంలోకి వచ్చిన టీడీపీ.. ప్రభుత్వ యంత్రాంగాన్ని సెట్‌చేసుకునే పనిలో పడిపోయింది.. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ వైపు పార్టీ నేతలతో భేటీలు అవుతూనే.. మరోవైపు అధికారులపై దృష్టిపెట్టారు. దీనిలో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జవహర్‌రెడ్డిని సెలవుపై వెళ్లాల్సిందిగా ఆదేశించడం.. వెంటనే ఆయన సెలవుపై వెళ్లడం జరిగిపోయాయి. ఇక, సాయంత్రంలోగా కొత్త సీఎస్ నియామకానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

Read Also: Gold Price Today: పసిడి ప్రియులకు భారీ షాక్.. తులం బంగారంపై రూ.770 పెరిగింది!

మరోవైపు.. రాజీనామాలు చేసినా.. చేయకపోయినా.. ప్రభుత్వ సలహాదారులను వెంటనే పదవుల నుంచి తప్పించాలని ఆదేశాలు వెళ్లాయి.. ఇక, అనారోగ్య కారణాలతో ఇప్పటికే సెలవుపై వెళ్లారు ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ రావత్. త్వరలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు.. అన్ని సెక్రటరియేట్ బదిలీలు ఆపుతూ ఉత్తర్వులు జారీ చేశారు.. కాగా, వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారని సీఎస్‌ జవహర్‌రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి.. సీఎస్‌ జవహర్‌రెడ్డిపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ కు ఫిర్యాదులు కూడా వెళ్లాయి.. ఈ నేపథ్యంలోనే ఆయన్ని పక్కన పెట్టాలని కొత్త ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబును నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు సీఎస్‌ జవహర్‌రెడ్డి.. కొన్ని అంశాలపై చర్చించే ప్రయత్నాలు చేసినా.. తర్వాత చూద్దామంటూ చంద్రబాబు దాటవేసినట్టుగా ప్రచారం సాగుతోంది.. ఇక, కొత్త సీఎస్‌గా ఎవరు వస్తారు అనే చర్చ సాగుతోంది.. సీనియర్స్‌ లిస్ట్‌ చూస్తే మాత్రం.. నీరబ్‌కుమార్‌, విజయానంద్‌ పేర్లు వినిపిస్తున్నాయి.. అయితే, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచిచూడాలి.

Read Also: Fish Prasadam: చేప ప్రసాదం పంపిణీ.. నాంపల్లి మైదానంలో విస్తృత ఏర్పాట్లు

ఇక, టీచర్ల బదిలీలకు బ్రేక్ వేసింది ప్రభుత్వం.. రాష్ట్రంలో గతంలో ఉపాధ్యాయుల బదిలీల కోసం ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేశారు.. ఎటువంటి బదిలీలూ చేపట్టొద్దని డీఈవోలకు ఆదేశాలు వెళ్లాయి.. ఈ మేరకు ఏపీ పాఠశాల విద్య కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.. ఎన్నికలకు ముందు మొత్తంగా 1,800 మంది టీచర్ల బదిలీలు జరిగాయి.. అయితే, పైరవీలు, సిఫార్సులతో ఈ బదిలీలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయా.. మరీ ముఖ్యంగా గత ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ ఒత్తిడితో ఈ సిఫార్సులు జరిగాయనే అభియోగాలు కూడా వచ్చిన నేపథ్యంలో.. మొత్తంగా బదిలీలనే నిలిపివేయాలనే నిర్ణయానికి వచ్చింది విద్యాశాఖ. ఇలా అన్ని విషయాలపై ఫోకస్‌ పెట్టింది కొత్త ప్రభుత్వం..

Exit mobile version