Site icon NTV Telugu

AP Council: మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై రచ్చ..

Ap Council

Ap Council

AP Council: తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం తీవ్ర వివాదంగా మారి.. పాలక, ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు, విమర్శలు కొనసాగుతుండగా.. ఈ రోజు లడ్డూ వ్యవహారం ఏపీ శాసన మండలిలో రచ్చకు దారితీసింది.. లడ్డూ అంశంపై చర్చ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. మండలి చైర్మన్ మోషేన్ రాజు ఇద్దరు క్రిష్టియన్స్ అంటూ వ్యాఖ్యానించారు అచ్చెన్నాయుడు.. అయితే, అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు చైర్మన్ మోషేన్‌రాజు.. తాను క్రిస్టియన్ కాదని చెప్పారు.. తాను హిందువునని తెలిపారు మండలి చైర్మన్.. అంతేకాదు.. తనను క్రిస్టియన్ గా మార్చాలని చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడమే కాకుండా.. అచ్చెన్నాయుడు క్షమాపణలు చెప్పాలని వైసీపీ సభ్యులు డిమాండ్‌ చేశారు.. దీంతో, శాసన మండలిలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది..

ఈ సందర్భంగా మళ్లీ మాట్లాడిన మంత్రి అచ్చెన్నాయుడు.. తాను మండలి చైర్మన్ క్రిస్టియన్ అనుకున్నాను.. ఆయన తాను హిందువును అని చెప్పారు.. అందుకే నా వ్యాఖ్యలు వెనక్కు తీసుకుంటున్నాను అన్నారు.. మండలి చైర్మన్ కు తప్పు అయ్యిందని ఒప్పుకుంటున్నా అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.. అయినా, మండలిలో మంటలు తగ్గలేదు.. మొత్తంగా క్రిస్టియన్స్‌ వ్యవహారంలో మండలిలో రచ్చగా రేపగా.. మంత్రి అచ్చెన్నాయుడు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నా.. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కాసేపు శాసన మండలి వాయిదా పడింది..

Exit mobile version