AP Council: మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై రచ్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Council: తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం తీవ్ర వివాదంగా మారి.. పాలక, ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు, విమర్శలు కొనసాగుతుండగా.. ఈ రోజు లడ్డూ వ్యవహారం ఏపీ శాసన మండలిలో రచ్చకు దారితీసింది.. లడ్డూ అంశంపై చర్చ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. మండలి చైర్మన్ మోషేన్ రాజు ఇద్దరు క్రిష్టియన్స్ అంటూ వ్యాఖ్యానించారు అచ్చెన్నాయుడు.. అయితే, అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు చైర్మన్ మోషేన్‌రాజు.. తాను క్రిస్టియన్ కాదని చెప్పారు.. తాను హిందువునని తెలిపారు మండలి చైర్మన్.. అంతేకాదు.. తనను క్రిస్టియన్ గా మార్చాలని చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడమే కాకుండా.. అచ్చెన్నాయుడు క్షమాపణలు చెప్పాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు.. దీంతో, శాసన మండలిలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది..
ఈ సందర్భంగా మళ్లీ మాట్లాడిన మంత్రి అచ్చెన్నాయుడు.. తాను మండలి చైర్మన్ క్రిస్టియన్ అనుకున్నాను.. ఆయన తాను హిందువును అని చెప్పారు.. అందుకే నా వ్యాఖ్యలు వెనక్కు తీసుకుంటున్నాను అన్నారు.. మండలి చైర్మన్ కు తప్పు అయ్యిందని ఒప్పుకుంటున్నా అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.. అయినా, మండలిలో మంటలు తగ్గలేదు.. మొత్తంగా క్రిస్టియన్స్ వ్యవహారంలో మండలిలో రచ్చగా రేపగా.. మంత్రి అచ్చెన్నాయుడు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నా.. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కాసేపు శాసన మండలి వాయిదా పడింది..
Also Read
- Jeetendra Mishra: ఆపరేషన్ సిందూర్ హీరో.. రామ మందిర కొత్త సీఈఓ జితేంద్ర మిశ్రా ఎవరు.?
- PM Kisan 24th Installment: రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్‌లో రూ.2,000 బదులు రూ.4,000.. ఎవరికంటే..?
- Kerala: ‘‘మహిళలు పబ్లిక్‌లోకి వస్తే విధ్వంసమే’’.. ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలపై సీఎం ఫైర్
- Quinton de Kock: 106 పరుగుల విధ్వంసం.. కోహ్లీ, వార్నర్ సరసన డి కాక్.. టీ20ల్లో అరుదైన రికార్డు
తాజావార్తలు
-
Jeetendra Mishra: ఆపరేషన్ సిందూర్ హీరో.. రామ మందిర కొత్త సీఈఓ జితేంద్ర మిశ్రా ఎవరు.?
-
PM Kisan 24th Installment: రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్‌లో రూ.2,000 బదులు రూ.4,000.. ఎవరికంటే..?
-
Kerala: ‘‘మహిళలు పబ్లిక్‌లోకి వస్తే విధ్వంసమే’’.. ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలపై సీఎం ఫైర్
-
Quinton de Kock: 106 పరుగుల విధ్వంసం.. కోహ్లీ, వార్నర్ సరసన డి కాక్.. టీ20ల్లో అరుదైన రికార్డు
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లలో ఫైనల్ ట్విస్ట్.. ఇక అధికారులే ఇంటికొస్తారు.!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!