ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని పార్టీలు అభ్యర్థుల వేటలో నిమగ్నమయ్యాయి. వైసీపీ, టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థుల జాబితాపై కసరత్తులు చేస్తున్నాయి. ఈ క్రమంలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల కోసం కాంగ్రెస్ పార్టీ.. విజయవాడ ఆంధ్ర భవన్‌లో దరఖాస్తులను స్వీకరిచింది. నేటితో కాంగ్రెస్ ధరఖాస్తుల పరశీలన ముగియనుంది.
Also Read: Yarlagadda VenkatRao: యార్లగడ్డ ఉదారస్వభావం.. సొంత ఖర్చుతో కుట్టు మిషన్ల పంపిణీ..
బుధవారం అర్ధరాత్రి వరకూ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనే అభ్యర్ధులు వేచి ఉన్నారు. ఈరోజు సాయంత్రం తుది జాబితా ఏఐసీసీకి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పంపనున్నారు. అభ్యర్థులపై ఏపీ కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడి ఏఐసీసీ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఇక తిరుపతిలో సభ నాటికి అభ్యర్థులను ఏఐసీసీ నిర్ణయించనుంది. కమ్యూనిష్టులతో పొత్తులో భాగంగా గన్నవరం లాంటి కీలక స్ధానాలు ఆ పార్టీలు (కమ్యూనిష్టులు) కోరినట్టు సమాచారం తెలుస్తోంది. ఏపీలో ఈసారి అధికారం చేపట్టాలని కాంగ్రెస్ చూస్తోంది. వైసీపీ, టీడీపీ-జనసేనతో గట్టి పోటీ మాత్రం తప్పదు.