ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి ఏపీలో పునర్వైభవం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ మూడు జిల్లాల్లో పర్యటించబోతున్నారు. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కాంగ్రెస్ పార్టీ నేతలతో ఆమె సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించనున్నారు..
Read Also: Mallu Bhatti Vikramarka: ఖమ్మం జిల్లాలో భట్టి విక్రమార్క పర్యటన..
ఇక, పార్టీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైఎస్ షర్మిల తనదైన దూకుడును కొనసాగిస్తుంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని వైసీపీని టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. మరోవైపు టీడీపీ- బీజేపీ పార్టీలపై సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల పర్యటనతో గతంలో కాంగ్రెస్ పార్టీలో పని చేసిన వారిని యాక్టివ్ చేసేందుకు ఆమె సిద్ధమయ్యారు. అందులో భాగంగానే రాష్ట్రంలోని పార్టీ నేతలను వరుసగా కలుస్తున్నారు. ఇక, ఏపీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు అందరూ కష్టపడితే ఎన్నికలలో ఎలాంటి ఫలితాలు సాధించవచ్చు అనే విషయాలను చెప్పటానికి వైఎస్ షర్మిల జిల్లాల వారీగా పర్యటనలు చేస్తున్నారు.