NTV Telugu Site icon

CM YS Jagan: అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. తుపాను పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష

Jagan

Jagan

CM YS Jagan: ఏపీలో తుపాను పరిస్థితులపై  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాజా పరిస్థితిపై వరుసగా రెండో రోజు అధికారులతో సమీక్షించారు. అధికారులు, తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి పలు ఆదేశాలు జారీ చేశారు.  తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సహాయక చర్యలు చేపట్టేందుకు అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలన్నారు. శిబిరాల్లో సౌకర్యాలు ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

ఆహారం, తాగునీరు, మందుల సరఫరా, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు ముఖ్యమంత్రి జగన్‌. తుపాను వల్ల విద్యుత్‌, రవాణా, సమాచార, కమ్యూనికేషన్ల వ్యవస్థ దెబ్బతింటే యుద్ధప్రాతిపదికిన పునరుద్ధరించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. తుపాను పరిస్థితులు, సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు నివేదించాలని అధికారులకు సూచించారు. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో రేపు ఉదయం మరోసారి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షిస్తామన్నారు. పొలాల్లో ఉన్న ధాన్యం తడిసి పోకుండా పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం తడిపిపోకుండా వెంటనే మిల్లులు లేదా భద్రతమైన ప్రాంతాలకు తరలించే బాధ్యతను అధికారులు తీసుకోవాలని ఆదేశించారు. రైతుల వద్ద నున్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.  భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున జల వనరుల శాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు.

 

 

 

Show comments