NTV Telugu Site icon

AP CM YS Jagan: ట్రెండింగ్‌లో సీఎం జగన్‌ ఫొటో.. ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ కార్యక్రమానికి భారీ మద్దతు

Why Ap Needs Jagan

Why Ap Needs Jagan

AP CM YS Jagan: ఏపీలో అధికార పార్టీ వైసీపీ రెండో సారి అధికారంలోకి రావ‌డానికి ముమ్మర ప్రయ‌త్నాలు చేస్తోంది. ప‌క్కా వ్యూహాల‌తో ముందుకు వెళ్తోంది. ఎక్కడ ఏ చాన్స్ వ‌ద‌ల‌కుండా అన్నింటిపై ఫోక‌స్ పెట్టింది. గ‌త ఎన్నిక‌ల్లో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్.. ఇప్పుడు మ‌రో సారి అధికారం ద‌క్కించుకోవాల‌ని, పార్టీని ప‌రుగులు పెట్టించాల‌ని సోష‌ల్ మీడియాపై ఫోక‌స్ పెట్టిన‌ట్లు తెలుస్తోంది. పార్టీ గురించి ప్రభుత్వం గురించి సానుకూలంగా సోషల్ మీడియా ద్వారా జనంలోకి తీసుకుపోవడం ద్వారా వైసీపీకి మరోసారి విజయాన్ని దక్కించుకోవడానికి పార్టీ ఈ ప్లాన్ వేసింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇదిలా ఉండగా.. ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ కార్యక్రమానికి మద్దతుగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు సోషల్ మీడియాలో భారీగా పోస్టులు చేస్తున్నాయి. ఏపీలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను ప్రస్తావిస్తూ వైసీపీ శ్రేణులు సీఎం జగన్‌ ఫొటోను ట్రెండ్ చేస్తున్నారు.

Also Read: BRS Legal Team: కాంగ్రెస్ పార్టీపై సీఈఓ వికాస్ రాజ్ కు బీఆర్ఎస్ లీగల్ టీం ఫిర్యాదు

“నవరత్నాలు, రూ.13లక్షల కోట్ల పెట్టుబడులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ, బీసీలకు 50 శాతం ఎంపీ సీట్లు, 17 మెడికల్‌ కాలేజీలు, ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, 30 లక్షల ఇళ్లపట్టాలు, సచివాలయాలు, రూ.1కే టిడ్కో ఇళ్లు సహా ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి జరగాలంటే జగనే రావాలి” అని సీఎం జగన్‌ ఉన్న ఫొటోను వైసీపీ శ్రేణులు ట్రెండ్‌ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా.. వైసీపీ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. వైసీపీ సోష‌ల్ మీడియా సైన్యం ట్విటర్‌ను ఊపేస్తోంది. పాల‌న‌లో వైయ‌స్ జ‌గన్ ప్రభుత్వం సాధించిన విజ‌యాలు, ఆయ‌న రాజ‌కీయ ప్రస్థానానికి సంబంధించిన స‌మాచారంతో ట్వీట్లను నెటిజెన్లు షేర్‌ చేస్తున్నారు. ఆ ట్వీట్లను పార్టీ కార్యకర్తలు షేర్‌ చేస్తున్నారు. ఈ ట్వీట్లకు దేశవ్యాప్తంగా భారీగా వ్యూస్ వస్తున్నాయి.