NTV Telugu Site icon

CM YS Jagan: దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయాలకు ప్రతీక.. దీపావళి

Jagan

Jagan

CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ సీఎం జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి అంటే కాంతి-వెలుగు అని సీఎం పేర్కొన్నారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం, దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయాలకు ప్రతీక దీపావళి అని సీఎం జగన్‌ తెలిపారు. తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరి జీవితాలు శోభాయమానంగా వెలుగొందాలని ముఖ్యమంత్రి కోరుకున్నారు. ప్రతి ఇంటా ఆనంద కాంతులు విరాజిల్లాలని ఆకాంక్షిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి.

Also Read: PM Modi: మహాసభ వేదికపై కంటతడి పెట్టిన మందకృష్ణ.. ఓదార్చిన ప్రధాని మోడీ

ఇదిలా ఉండగా.. దీపావళి సెలవులో కీలక మార్పు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. క్యాలెండర్‌లో గానీ, ప్రభుత్వం జారీ చేసిన పండగ సెలవుల జాబితాలో గానీ దీపావళి నవంబర్ 12వ తేదీ అని ఉంది. 12వ తేదీన ఉన్న సెలవును 13వ తేదీన సాధారణ సెలవుగా పేర్కొంటూ ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు విడుదల చేశారు. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం దీపావళి సెలవును నవంబర్ 13వ తేదీకి మార్చింది. ఇంతకుముందు నవంబరు 13వ తేదీ ఆప్షనల్ హాలిడేగా ఉండగా, ఇప్పుడు దాన్ని ఏపీ ప్రభుత్వం సాధారణ సెలవుగా మార్పు చేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన లీవ్స్ లిస్టులో నవంబర్ 12వ తేదీన ఆదివారం దీపావళిగా, అదే రోజు సెలువుగా ఉంది. కానీ ఆదివారం ఎలాగూ గవర్నమెంట్ హలీడే కాబట్టి సెలవులో మార్పు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ నోటిఫికేషన్ జారీ చేశారు.