NTV Telugu Site icon

Good News: ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన సీఎం జగన్‌.. పెరిగిన హెచ్‌ఆర్‌ఏ

Ys Jagan

Ys Jagan

Good News: ఉద్యోగులకు శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఉద్యోగుల హెచ్ఆర్ఏ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ప్రభుత్వ ఉద్యోగుల హెచ్ఆర్ఏ పెంచుతూ నిర్ణయం తీసుకున్న సర్కార్.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.. కొత్త జిల్లాల హెడ్ క్వార్టర్ లో పని చేసే ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంచింది సర్కార్.. 12 శాతం నుండి 16 శాతానికి హౌస్ రెంట్ అలవెన్స్‌ (హెచ్‌ఆర్‌ఏ) పెంచేశారు.. పార్వతీపురం, పాడేరు, అమలాపురం, బాపట్ల,రాజమండ్రి, భీమవరం, నరసరావుపేట, పుట్టపర్తి, రాయచోటి జిల్లా కేంద్రాల ఉద్యోగులకు ఈ పెంచిన హెచ్‌ఆర్‌ఏ వర్తింపజేయనున్నారు.. ఉద్యోగుల వినతి మేరకు 16 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు స్పెషల్ సీఎస్‌ రావత్‌.. కాగా, గత కొంతకాలంగా డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు పోరాటం చేస్తూనే ఉన్నారు.. పలు దఫాలుగా చర్చలు కూడా సాగుతోన్న విషయం విదితమే.. ఇదే సమయంలో.. కొన్ని డిమాండ్ల పరిష్కారానికి పునుకున్న జగన్‌ సర్కార్‌.. వాటి పరిష్కారంపై ఫోకస్‌ పెట్టింది.

Read Also: Vijayawada Crime: బీటెక్‌ స్టూడెంట్‌ హత్య కేసులో కొత్త ట్విస్ట్‌.. వెలుగులోకి సంచలన విషయాలు

Show comments