Site icon NTV Telugu

Martyrs’ Day 2024: మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని మన ప్రభుత్వంలో సాకారం చేశాం..

Ys Jagan

Ys Jagan

Martyrs’ Day 2024: మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని మన ప్రభుత్వంలో సాకారం చేశాం అన్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా స్పందించిన ఆయన.. “సత్యం, అహింస తన ఆయుధాలుగా స్వతంత్ర పోరాటం చేసి, జాతిపితగా నిలిచారు మహాత్మా గాంధీ గారు. ఆయన కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని మన ప్రభుత్వంలో గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా సాకారం చేశాం. నేడు ఆయన వర్థంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను.” అంటూ ట్విట్టర్‌ (ఎక్స్‌)లో ట్వీట్‌ చేశారు.

Read Also: Sharathulu Vartisthayi: ఆసక్తి రేకెత్తిస్తున్న ‘పన్నెండు గుంజల పందిర్ల కిందా ..’ లిరికల్ సాంగ్ రిలీజ్

ఇక, అంతకుముందు జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌.. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖా మంత్రి గుడివాడ అమర్‌నాథ్, వైఎస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయి రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ ఉత్తరాంధ్ర రీజనల్‌ కోఆర్డినేటర్‌ వైవీ. సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, అహింసా, సత్యాగ్రహాలే ఆయుధాలుగా దేశానికి స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు అందించి.. జాతిపితగా నిలిచిన మహాత్మా గాంధీ వర్ధంతిని అమరవీరుల దినోత్సవంగాజరుపుకుంటారు.. 1948 జనవరి 30వ తేదీన నాథూరామ్ గాడ్సే అందరూ చూస్తుండగా మహాత్ముడిపై కాల్పులు జరపడం.. హే రామ్ అంటూ ఆ మహనీయుడు ప్రాణాలు విడిచిన విషయం విదితమే.. ఇవాళ ఆ మహాత్ముడి 76వ వర్ధంతిని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.. గుజరాత్ రాష్ట్రంలోని కథియవాడ్ జిల్లా పోరు బందర్ గ్రామంలో 1869 అక్టోబర్ 2వ తేదీన కరంచంద్ గాంధీ, పుత్లీ బాయి దంపతులకు మహాత్మా గాంధీ జన్మించారు.

Exit mobile version