NTV Telugu Site icon

AP CM YS Jagan: ఇంటికే వైద్యం.. ఫ్యామిలీ డాక్టర్‌ దేశానికే రోల్‌ మోడల్

Ap Cm Jagan

Ap Cm Jagan

AP CM YS Jagan on Family Doctor Concept: ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం మరో ప్రతిష్ఠాత్మక విధానాన్ని ప్రారంభించింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. దేశంలో గొప్ప మార్పునకు లింగంగుంట్ల నుంచి శ్రీకారం చుట్టామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ప్రారంభోత్సవం కోసం గురువారం పల్నాడులో పర్యటించిన ఆయన.. లింగంగుంట్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. రాష్ట్రవ్యాప్తంగా ఫ్యామిలీడాక్టర్‌ విధానం నేటి నుంచి ప్రారంభిస్తున్నాం. దేశచరిత్రలోనే వైద్యసేవల విధానంలో నూతన విధానానికి శ్రీకారం చుట్టాం. ఈ కాన్సెప్ట్‌ దేశ చరిత్రలోనే రోల్‌ మోడల్‌గా నిలుస్తుందని సీఎం జగన్‌ ఆకాంక్షించారు.

ఆధునిక వైద్యాన్ని ఉచితంగా మీ గడప వద్దకు తీసుకువచ్చే విధానమే ఫ్యామిలీ డాక్టర్ విధానమని ముఖ్యమంత్రి తెలిపారు. దేశ చరిత్రలో ఒక గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందన్నారు. వైద్యం కోసం ఏ పేదవాడు ఇబ్బంది పడకూడదనే గొప్ప ఉద్దేశంతో రాష్ట్రంలో నేటి నుంచి ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలులోకి వచ్చిందన్నారు. ఇక పై డాక్టర్ కోసం ప్రజలు బయటకు వెళ్లాల్సిన పనిలేదని, ప్రతి పేదవాడి ఇంటి ముందుకు డాక్టరు,మందులు వస్తాయన్నారు. పెన్షన్లు మీ ఇంటికి నడిచి వచ్చినట్లుగా వైద్యం కూడా మీ ముంగిట్లో కి వస్తుందన్నారు సీఎం జగన్. వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్‌ల లో 105 రకాల మందులు, 14 రకాల టెస్ట్‌లు అందుబాటులో ఉంటాయన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీనియర్ డాక్టర్ల సలహా తీసుకునే సదుపాయం ఉందన్నారు. వైద్య సిబ్బంది పోస్టింగ్ ఉన్న చోటే అందుబాటులో ఉండాలని సీఎం సూచించారు. పేదలకు వైద్య ,ఆరోగ్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం ఉండకూడదని ఆయన ఆదేశించారు.

Read Also: Kakani Govardhan Reddy: పబ్లిసిటీ కోసమే కోటంరెడ్డి హంగామా.. నాలుగేళ్లలో గుర్తుకు రాలేదా?

డాక్టర్‌ కోసం మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆస్పత్రులు, డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ప్రతి పేదవాడు వైద్యం కోసం ఇబ్బంది పడకూడదనే ఈ ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ తీసుకొచ్చాం. ఫ్యామిలీ డాక్టర్‌తో వ్యాధులు ముదరకముందే గుర్తించవచ్చు. విలేజ్‌ క్లినీక్‌లో సీహెచ్‌వో, ఏఎన్‌ఎం, ఆశావర్కర్లు ఉంటారు. ప్రతీ 2వేల జనాభాకు ఓ క్లినిక్‌ ఉంటుంది. మండలానికి రెండు పీహెచ్‌సీలు. ప్రతీ పీహెచ్‌సీలు ఇద్దరు వైద్యులు ఉంటారు. ఒకరు పీహెచ్‌సీలో ఉంటే.. మరొకరు ఆంబులెన్స్‌లో తిరుగుతుంటారు. వైఎస్‌ఆర్‌ విలేజ్‌క్లినిక్‌లను పీహెచ్‌సీలతో అనుసంధానిస్తాం. వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లో 14 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారని, 105 రకాల మందులు అందుబాటులో ఉంటాయని అన్నారాయన. సాధారణ వైద్య సేవలతో పాటు తల్లులు, బాలింతలకు వైద్య సేవలు ఉంటాయని పేర్కొన్నారు.

Read Also: AP 40G: ఏపీలో ప్రభుత్వ వాహనాలకు కొత్త రిజిస్ట్రేషన్ నంబర్ సిరీస్

ఆరోగ్య శ్రీ పేరు చెప్పగానే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తు వస్తారని.. ఆరోగ్య శ్రీ ,108,104 పథకాల రూపకర్త వైఎస్‌ అని ఈ సందర్భంగా జగన్‌ గుర్తు చేశారు. గత ప్రభుత్వం ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించకుండా నిర్వీర్యం చేశారని ఆయన విమర్శించారు. మన ప్రభుత్వం ఆరోగ్య శ్రీ బకాయిలు మొత్తం చెల్లించిందని… 1000 కి పైగా జబ్బులకు ఆరోగ్య శ్రీ ద్వారా ఉచిత వైద్యం అందిస్తున్నామన్నారు. ప్రాణం విలువ తెలిసిన మన ప్రభుత్వం , పేదవాడి వైద్యం కోసం ఆరోగ్య శ్రీ ద్వారా 9 వేల కోట్లు ఖర్చు పెట్టిందని ఈ సందర్భంగా చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖను బలోపేతం చేయడానికి 48,639పోస్టులు భర్తీ చేశామన్నారు. వైద్య ఆరోగ్య శాఖపై ప్రతి ఏటా 18వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని, రాష్ట్రంలో శిథిలావస్థకు చేరిన మెడికల్ కాలేజీలను నాడు-నేడు పథకం ద్వారా ఆధునికీకరిస్తున్నామన్నారు. రాష్ట్రంలో మరో 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం చేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇది అభివృద్ధి కాదా అంటూ సీఎం జగన్ ప్రశ్నించారు. ఈ సర్కారు బతికించే ప్రభుత్వమని.. ఆరోగ్య శ్రీ ద్వారా 3250 జబ్బులకు వైద్యం అందిస్తున్నామన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చామని సీఎం జగన్‌ అన్నారు.

స్కాంలు తప్ప స్కీమ్‌లు తెలియని బాబులకు, అభివృద్ధి కనిపించడం లేదని ముఖ్యమంత్రి జగన్‌ మండిపడ్డారు. నన్ను ఒంటరిగా ఎదర్కోలేక జిత్తులు, ఎత్తులు, పొత్తుల పేరుతో కుయుక్తులు పన్నుతున్నారన్నారు. నవ రత్నాలుతో తాను వస్తుంటే తట్టుకోలేని తోడేళ్ళు ఒక్కటవుతున్నారన్నారు. తనకు ప్రజలతోనే పొత్తు అని సీఎం జగన్‌ అన్నారు. జిత్తులు,పొత్తులు, కుయుక్తులు తనకు తెలియవని.. నిజం మాట్లాడటమే తనకు తెలుసన్నారు.