NTV Telugu Site icon

CM YS Jagan: క్లీనింగ్ యంత్రాలను ప్రారంభించిన సీఎం జగన్‌..

Cm Jagan

Cm Jagan

CM YS Jagan: సఫాయి కార్మికుల కోసం క్లీనింగ్ యంత్రాలను ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. స్వచ్ఛత ఉద్యమి యోజన కింద స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా లబ్దిదారులకు 100 మురుగుశుద్ధి వాహనాల అందజేశారు.. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి సఫాయి కార్మికులు వినియోగించే క్లీనింగ్ యంత్రాలను జెండా ఊపి ప్రారంభించారు ఏపీ సీఎం.. ఇక, ఈ కార్యక్రమంలో మంత్రి మేరుగు నాగార్జున, ఎంపీ నందిగం సురేష్‌, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి సహా పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మొత్తంగా పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేకంగా ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.. మురుగు నీరు, చెత్త నిర్మూలన వాహనాను అందుబాటులోకి తెచ్చింది.. సఫాయి కర్మచారీల కోసం 100 మురుగు శుద్ధి వాహనాలను ప్రారంభించారు సీఎం వైఎస్‌ జగన్‌.. జెండా ఊపి వాహనాలను ప్రారంభించిన ఆయన.. పారిశుద్ధ్య కార్మికులకు వాహనులకు సంబంధించిన కీలను అందజేశారు.. మరోఎవైపు, రేపు నంద్యాల, కడప జిల్లాల్లో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటించనున్నారు. నంద్యాల జిల్లాలో నిర్మించిన అవుకు రెండో టన్నెల్‌ను జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం కడప పెద్దదర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాల్లో పాల్గొననున్న ఆయన.. సాయంత్రానికి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.