Site icon NTV Telugu

CM YS Jagan: నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం..

Ys Jagan

Ys Jagan

CM YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.. ప్రచారంలో మరింత స్పీడ్‌ పెంచుతున్నారు.. ఈరోజు మరో మూడు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు.. మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇక, మూడు సభల్లో పాల్గొనేందుకు ఉదయమే తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరనున్నారు సీఎం జగన్.. ఉదయం 10 గంటలకు నరసాపురం లోక్‌సభ స్థానం పరిధిలోని నరసాపురంలో ఉన్న స్టీమెర్‌ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో పాల్గొని ప్రసంగిస్తారు.. ఆ తర్వాత.. మధ్యాహ్నం 12.30 గంటలకు నరసరావుపేట లోక్‌సభ స్థానం పరిధిలోని పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరు సెంటర్‌లో జరిగే సభలో పాల్గొంటారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌..

Read Also: Rahul gandhi: రాయ్‌బరేలీ నుంచి రాహుల్..! అమేథీ నుంచి ఎవరంటే..!

అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఒంగోలు పార్లమెంట్‌ పరిధిలోని కనిగిరిలో ప్రచారంలో పాల్గొననున్న ఆయన.. పామూరు బస్‌స్టాండ్‌ సెంటర్‌లో నిర్వహించే సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3.10 గంటలకు కనిగిరి చేరుకోనున్న సీఎం జగన్.. 3.20 గంటలకు హెలిప్యాడ్ దగ్గర నుంచి బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంటారు.. 3.35 గంటల నుంచి 4.20 గంటల వరకు కనిగిరి ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్న సీఎం జగన్.. తిరిగి 4.40 గంటలకు తాడేపల్లి బయలుదేరి వెళ్లనున్నారు.. సాయంత్రం 5.50 గంటలకు తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. ఇక, ఎన్నికల ప్రచారంలో తమ ప్రభుత్వ హయాంలో మంచి జరిగితేనే తమకు మరోసారి అవకాశం ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ చెబుతున్నారు.. ఇదే సమయంలో విపకాలపై ఓరేంజ్ లో విరుచుకుపడుతున్నారు సీఎం వైఎస్ జగన్

Read Also: Kangana Ranaut : కంగనా రనౌత్ కు షాకిచ్చిన రైతులు.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్

Exit mobile version