NTV Telugu Site icon

CM YS Jagan: మీకోసం 124 సార్లు బటన్ నొక్కా.. నా కోసం రెండు బటన్లు నొక్కండి..!

Jagan

Jagan

మీకోసం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంలో 57 నెలల్లో ఏకంగా 124 సార్లు బటన్ నొక్కా.. నేరుగా అక్క, చెల్లెమ్మల ఖాతాల్లో సొమ్ములు జమ చేశాను అన్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఏలూరు జిల్లా దెందులూరులో నిర్వహించిన ‘సిద్ధం’ సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. మీరే నా స్టార్‌ క్యాంపెయినర్లు.. ఈ ఎన్నికల్లో జగనన్న కోసం మీరు పనిచేయాలి.. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే.. మళ్లీ జగనన్న రావాలి.. మనం జగనన్న కోసం రెండు బటన్లు (అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో..) నొక్కలేమా అని అందరినీ అడగాలి.. ఓట్లు వేయించాలని పిలుపునిచ్చారు సీఎం జగన్‌.. ఇక, వాళ్లంతా నాన్ ఆంధ్ర రెసిడెంట్స్.. పెద్ద మనిషి సైకిల్ తొక్కడానికి ఇద్దరినీ, తోయ్యడానికి ఇద్దరినీ పిలుస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు. పొత్తులు లేకపోతే 175స్థానాల్లో పోటీ చేసే ధైర్యం వారికి లేదు.. ఈ యుద్ధం ప్రజలకు ఇచ్చిన మాట మీద నిలబడిన ఈ ఒక్కడి పై కలబడి వంద మంది వంద బాణాలు వేస్తున్నప్పుడు ప్రజలే రక్షణ కవచం.. వంద బాణాలను, కౌరవ సైన్యాన్ని ఎదుర్కొనేందుకు మీరంతా సిద్ధమా? అని ప్రజలను ప్రశ్నించారు.

Read Also: Sakshi Agarwal: డైరెక్టర్ అట్లీ నన్ను మోసం చేశాడు.. సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తానని..

రా కదలి రా అంటూ చంద్రబాబు ప్రజలను కాదు పిలిచేది.. ప్యాకేజీ ఇస్తా అంటూ రా కదలి రా అంటూ దత్త పుత్రుడు, వదినమ్మని పిలుస్తున్నారు అని సంచలన ఆరోపణలు చేశారు సీఎం జగన్‌.. ఒక అసెంబ్లీ, ఒక పార్లమెంట్ కు ఫ్యాన్ మీద ఓటు వేస్తే చంద్రముఖి రాష్ట్రం నుంచి శాశ్వతంగా పోతుంది.. గ్రహణం పోతుంది.. లేదంటే పేదల జీవితాల్లో లకలక అంటూ అబద్ధపు హామీలతో పట్టి పీడిస్తుంది అంటూ చంద్రబాబుపై సెటైర్లు వేశారు. చెప్పుకోడానికి ఏమిలేక పొత్తులు, జిత్తులు, నక్కజిత్తులుతో రాజకీయాలు చేస్తున్నారు. ఈ మధ్య చంద్రబాబుకు ఎన్టీఆర్‌ గుర్తు వస్తున్నారు.. వెన్నుపోటు పొడిచేది ఆయనే.. అని మండిపడ్డారు. మహిళ సాధికారిత అంటే దిశా యాప్ చూసినపుడు గుర్తుకు వచ్చేది మీ జగన్.. వైఎస్ఆర్ తీసుకు వచ్చిన మంచి పథకాలకు మరో నాలుగు అడుగులు ముందుకు వేసి మరిన్ని పథకాలు తీసుకు వచ్చాం.. ఎప్పుడు వినని పారిశ్రామిక అభివృద్ధి మొదలయ్యింది.. నేను చెప్పిన ప్రతి విషయం వాస్తవాలు కాదా అని ఆలోచించి ప్రతి ఇంటికి తీసుకు వెళ్ళాలి.. అసాధ్యం అనుకున్న పనులు సుసాధ్యం చేశాం అన్నారు సీఎం వైఎస్‌ జగన్‌.