NTV Telugu Site icon

CM Jaganmohan Reddy: ఈ నెల 3న రాజమహేంద్రవరం పర్యటనకు సీఎం జగన్‌

Cm Jagan

Cm Jagan

CM Jaganmohan Reddy: ఈ నెల 3వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా 13 రకాల పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులతో సభా స్థలం వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం తిలకించనున్నారు. వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపుదల, లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Speaker Tammineni Sitaram: తొడగొట్టిన స్పీకర్ తమ్మినేని.. ఎందుకో తెలుసా?

ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు రాజమహేంద్రవరం చేరుకుంటారు. 11.20 నుంచి 1.10 వరకు ఆర్ట్స్‌ కళాశాల ప్రాంగణంలో వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపుదల, లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 2.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.