Site icon NTV Telugu

CM Chandrababu: ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రధాని సహా కేంద్ర మంత్రులతో భేటీ

Chandrababu

Chandrababu

CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని సహా కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు. సాయంత్రం 4.45గంటలకు ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. సాయంత్రం 6:15కి రైల్వే, సమాచార ప్రసారాల శాఖల మంత్రి అశ్వని వైష్ణవ్‌తో భేటీ కానున్నారు. రాత్రికి లేదా రేపు ఉదయం 10:30కి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీకానున్నట్లు సమాచారం.

Read Also: Akkineni Nagarjuna: రేపు కోర్టుకు హాజరు కానున్న హీరో నాగార్జున

రేపు ఉదయం 11:30కి రవాణా మంత్రి నితిన్ గడ్కరీతో ముఖ్యమంత్రి భేటీకానున్నారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, హార్దీప్ సింగ్ పూరితో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. బుడమేరు వరదలపై నివేదిక తర్వాత తొలిసారి ప్రధానిని కలుస్తున్నారు. వరద సాయం, రైల్వే జోన్ ఏర్పాటు, విశాఖ ఉక్కును స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం, అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధుల విధులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడటం, పోలవరం నిర్మాణానికి నిధులు విడుదలపై ప్రధానితో చంద్రబాబు చర్చించనున్నారు.

Exit mobile version