NTV Telugu Site icon

CM Chandrababu: మంత్రులకు మరోసారి సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్!

Chandrababu

Chandrababu

CM Chandrababu: కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు, కొంతమంది అధికారుల తీరుపైన చంద్రబాబు మంత్రులతో చర్చించారు. గత ప్రభుత్వంలో విమర్శలు ఎదుర్కొన్నా అధికారుల తీరు మారలేదని మండిపడ్డారు. అలాంటి అధికారుల తీరు కారణంగానే మనం విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. మంచిగా ఉండొచ్చు… కానీ మెతకగా ఉండకూడదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మంత్రులు పనితీరును మెరుగుపరచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. . చాలా మంది మంత్రులకు ఇంకా సీరియస్‌నెస్ రావడం లేదని.. కొంత మంది మంత్రులకు ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోవడం లేదని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.

Read Also: AP Cabinet: సోషల్ మీడియాలో పోస్టులపై ఏపీ కేబినెట్‌లో కీలక చర్చ

సోషల్ మీడియాలో పోస్టులపై ఏపీ కేబినెట్‌లో కీలక చర్చ జరిగింది. సోషల్ మీడియాలో పోస్టులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చర్చను లేవనెత్తారు. కొంత మంది వైసీపీ నేతలు మళ్లీమళ్లీ పోస్టులు పెడుతున్నారని.. వారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవట్లేదని పవన్‌ కల్యాణ్ కేబినెట్‌ సమావేశంలో పేర్కొన్నారు. కొంత మంది పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్‌కు వత్తాసు పలికిన కొంతమంది అధికారులు ఇప్పుడు కూడా కీలక పోస్టుల్లో ఉన్నారన్నారు. ఇలా అయితే ఎలా అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. కొంత మంది ఎస్పీలకు ఫోన్ చేసినా రియాక్టు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కింది స్థాయిలో ఉన్న డీఎస్పీలు, సీఐలపై నెపం నెట్టి తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. ఇంట్లో మహిళల పైనా పోస్టులు పెడితే ఊరుకోవాలా?…అందువల్లే తాను రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు.

Show comments