CM Chandrababu: కాకినాడ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. కిర్లంపూడి మండలం రాజుపాలెం సచివాలయం దగ్గర గ్రామస్థులతో సీఎం మాట్లాడారు. ఏలేరు వరద ముంపు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏలేరుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్షలు చేస్తున్నారని.. వరద బాధితులను ఎంత వరకు ఆదుకోగలమో అంతవరకు ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. ఏలేరుకి 47 వేలు క్యూసెక్కుల నీళ్లు ఒక్క సారిగా వచ్చాయన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈ ఇబ్బందులు వచ్చాయని, ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టలేదని సీఎం మండిపడ్డారు. ఏలేరు కాలువ ఆధునికీకరణ బాధ్యత ఏన్డీఏ ప్రభుత్వానిదని ఆయన హామీ ఇచ్చారు.
Read Also: Rammohan Naidu: ఆసియా-పసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఛైర్మన్‌గా రామ్మోహన్ నాయుడు
65 వేలు హెక్టార్లలో పంట నష్టం జరిగిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రతి కుటుంబానికి 10 వేలు ఆర్ధిక సాయం చేస్తామని, బట్టలు కూడా ఇస్తామని ప్రకటించారు. పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో హెక్టార్‌కు రూ.25 వేలు నష్ట పరిహారం ఇస్తామన్నారు. ఈ నెల 17వ తేదీలోపు బాధితులకు పరిహారం అందిస్తామన్నారు. నష్టపోయిన వారికి ప్రభుత్వం కొత్త ఇల్లు కట్టి ఇస్తుందన్నారు. పనికిమాలిన వ్యక్తి రాష్ట్రంలో ప్రతి పక్షంలో ఉన్నాడని ఆయన విమర్శించారు. శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు రెండు సీట్లు ఇచ్చారని వ్యాఖ్యానించారు. ప్రకాశం బ్యారేజ్‌ను కూల్చడానికి ప్రయత్నం చేశాడని, రెండున్నర లక్షల కుటుంబాలకు అన్యాయము చేశారంటూ ఆరోపించారు. ఇబ్బందులు ఉంటే చెప్పాలని కరెక్ట్ చేసుకుంటామని ప్రజలకు సూచించారు. త్వరలో ఒక యాప్ వస్తుంది.. మీ ఇబ్బందులు ఉంటే మాకు చెప్పండి అంటూ తెలిపారు.