Site icon NTV Telugu

AP CM Chandrababu: రతన్ టాటాకు నివాళిగా ఆయన పేరుతో హబ్.. సీఎం ట్వీట్

Ap Cm Chandrababu

Ap Cm Chandrababu

AP CM Chandrababu: రతన్ టాటా వారసత్వాన్ని ఏపీ నిరంతరం గుర్తు చేసుకుంటూనే ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. అమరావతిలో ‘రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్’ పేరుతో ఒక ఇన్నోవేషన్ హబ్‌ను స్థాపించనున్నామని ఆయన తెలిపారు. రతన్ టాటాకు నివాళిగా ఆయన పేరుతో హబ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ హబ్ ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎకోసిస్టమ్, మెంటర్ స్టార్టప్‌లను ప్రోత్సహిస్తుందన్నారు. ఈ హబ్ ఐదు ఇతర జోనల్ కేంద్రాలకు అనుసంధానిస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న రంగాలలో సాంకేతికత నైపుణ్యాల మెరుగుదలని ఈ హబ్ ద్వారా అందిస్తామన్నారు.

Read Also: Amaravati Drone Summit 2024: అమరావతి డ్రోన్ సమ్మిట్ నిర్వహణకు ప్రభుత్వం ఉత్తర్వులు

సచివాలయంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ డ్రాఫ్ట్ పాలసీలపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షా సమావేశంలో.. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పేరుతో పారిశ్రామిక రంగ అభివృద్దికి ప్రత్యేక హబ్ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. స్కిల్స్ డెవలప్‌మెంట్, ఇన్నోవేషన్, స్టార్టప్స్, ఫెసిలిటేషన్ కేంద్రంగా అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలోని 5 ప్రాంతాల్లో హబ్‌కు అనుంబంధంగా సెంటర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ఒక్కో సెంటర్‌కు ఒక్కో మల్టీనేషనల్ కంపెనీ మెంటార్‌గా ఉండేలా ప్రతిపాదనలు చేయాలన్నారు.

Exit mobile version