ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. దీపావళి పండుగ రోజు సీఎం దీపం పథకం 2.0 గురించి చెప్పారు. దీపావళి కానుకగా శ్రీకాకుళం జిల్లా నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసేందుకు సిద్ధం అయ్యారు. ఈ క్రమంలో శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇచ్ఛాపురం నియోజకవర్గం, ఈదుపురంలో దీపం 2.0 ఉచిత సిలిండర్ల పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 4.95 లక్షల మంది మహిళలు దీపం పథకంకు అర్హులుగా ఉన్నారు.
Also Read: Crime News: రెండు కుటుంబాల మధ్య ఘర్షణ.. కత్తుల దాడిలో ముగ్గురు మృతి!
ఈ రోజు మధ్యాహ్నం 12.35 గంటలకు సీఎం చంద్రబాబు ఇచ్చాపురం మండలం ఈదుపురం చేరుకోనున్నారు. మధ్యాహ్నం 1 నుంచి 2:15 వరకు గ్రామస్తులతో ముఖాముఖి, సభలో ప్రసంగం చేయనున్నారు. మధ్యాహ్నం 3:15 గంటలకు సీఎం శ్రీకాకుళం చేరుకుంటారు. మధ్యాహ్నం 3:45 నుంచి సాయంత్రం 6:30 వరకు జిల్లా అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. రాత్రి ఆర్అండ్‌బీ అతిథి గృహంలో బస చేయనున్నారు. రాష్ట్రంలో దీపం పథకంతో కోటి 50 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.