NTV Telugu Site icon

CM Chandrababu: వరద సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

Chandrababu

Chandrababu

CM Chandrababu: ఏడో రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద బాధితుల కష్టాలను దృష్టిలో ఉంచుకునే పండుగ పూటా కూడా అవిశ్రాంతంగా పని చేస్తున్నామన్నారు. నిత్యావసరాల పంపిణీ, పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. బాధిత ప్రజలకు త్వరితగతిన రిలీఫ్ ఇచ్చేందుకు పండుగ నాడు కూడా పని చేయాలని కోరారు. బుడమేరుకు పడిన మూడో గండి పూడ్చే పనులు కొలిక్కి వచ్చాయన్నారు. మరి కొద్దిసేపట్లో ఆ పనులు పూర్తి అవుతాయన్నారు. దీంతో విజయవాడలోకి నీళ్లు రావని..భవిష్యత్తులో కూడా వరదలు వచ్చినా నీళ్లు రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. రేపు సాయంత్రానికి పూర్తిగా వీధుల్లో వరద నీరు తగ్గిపోతుందన్నారు.

Read Also: Brij Bhushan: ఫొగట్ ఒలంపిక్స్‌లో చీట్ చేసి ఫైనల్కు వెళ్లిన.. పతకం రాకుండా దేవుడు శిక్షించాడు..!

బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ కూడా శరవేగంగా జరుగుతోంది…పంపిణీ త్వరగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వరద ప్రభావం వల్ల 6వ డివిజన్ లో నిత్యవసర సరుకులు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు కోరుతున్నారని.. వారికి కూడా సరుకుల కిట్‌ను అందించాలని అధికారులను ఆదేశించారు. ఇళ్లల్లో జరిగిన నష్టంపై ఎన్యుమరేషన్ కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. శానిటైజేషన్ కూడా సాధ్యమైనంతగా పూర్తి చేయాలన్నారు. తెలంగాణ ప్రాంతంలో అధిక వర్షాల కారణంగా మనకు కొంత వరద వచ్చే అవకాశం ఉందని సీఎం తెలిపారు. దీనికి అనుగుణంగా అధికారులు సిద్దంగా ఉండాలని…ప్రజలను అప్రమత్తం చేయాలి…అవసరమైన సహాయం అందించాలన్నారు. టెలికాన్ఫరెన్స్ తరువాత విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ముఖ్యమంత్రి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎంతో పాటు మంత్రులు, అధికారులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.