NTV Telugu Site icon

CM Chandrababu: ఢిల్లీలో కొత్త శకం మొదలు కానుంది.. అద్భుతమైన అభివృద్ధి జరగబోతోంది!

Cm Chandrababu

Cm Chandrababu

ఢిల్లీలో కొత్త శకం మొదలు కానుందని, అద్భుతమైన అభివృద్ధి జరగబోతోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీలో కొత్త మార్పును చూడబోతున్నాం అని, ఇక నుంచి ఢిల్లీ మరోలా ఉంటుందన్నారు. ఢిల్లీకి మహిళా ముఖ్యమంత్రి ఉండడం తనకు చాలా ఆనందంగా ఉందని చంద్రబాబు తెలిపారు. గురువారం ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు, ఎన్డీఏ నేతలు హాజరయ్యారు.

రేఖా గుప్తా ప్రమాణ స్వీకారానికి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్, కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… ‘ఢిల్లీలో కొత్త మార్పును చూడబోతున్నాం. ఇక నుంచి ఢిల్లీ మరోలా ఉంటుంది. ఢిల్లీకి మహిళా ముఖ్యమంత్రి ఉండడం ఆనందంగా ఉంది. ఇక ఢిల్లీలో కొత్త శకం మొదలు కానుంది. అద్భుతమైన అభివృద్ధి జరగబోతోంది’ అని అన్నారు.