NTV Telugu Site icon

CM Chandrababu: ముగిసిన ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన!

Chandrababu Naidu

Chandrababu Naidu

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. నేడు దేశరాజధాని ఢిల్లీ నుంచి సీఎం చంద్రబాబు విజయవాడకు బయల్దేరనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ నుంచి ఆయన బయలుదేరనున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టులో సీఎంను టీడీపీ నేతలు కలిసే అవకాశం ఉంది.

ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ సహా ఐదుగురు కేంద్ర మంత్రులను ఏపీ సీఎం చంద్రబాబు కలిశారు. వారి దృష్టికి పలు ముఖ్యమైన అంశాలను తీసుకెళ్లారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి సంబంధించి చేసిన ప్రకటనలపై ప్రత్యేకంగా ప్రధానికి బాబు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీకి రావాల్సిన నిధులు త్వరగా ఇవ్వాలని కోరారు.

Also Read: Sports University: తెలంగాణలో స్పోర్ట్స్‌ యూనివర్సిటీ.. ఒలింపిక్స్‌ స్థాయి ప్రమాణాలతో అకాడమీలు!

శనివారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను సీఎం చంద్రబాబు కలిశారు. ఈ భేటీపై అమిత్‌ షా ఎక్స్‌ వేదికగా స్పందించారు. రాష్ట్ర, దేశ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించినట్లు చెప్పారు.

Show comments