NTV Telugu Site icon

CM Chandrababu: పోలవరంలో సీఎం చంద్రబాబు.. పనుల పురోగతిపై ఆరా

Babu

Babu

CM Chandrababu: ఆంధ్రప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు దగ్గరకు చేరుకున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఆయనకు మంత్రులు నిమ్మల, పార్థ సారథి, కందుల దుర్గేష్‌ సహా.. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు.. కూటమి నేతులు స్వాగతం పలికారు.. అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు.. ఆ వెంటనే.. పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు బయల్దేరారు.. గతంలో ప్రతీ సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ఆయన.. మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. ప్రాజెక్టు పరిశీలనకు వచ్చారు.. మొదట వ్యూ పాయింట్ నుంచి పోలవరం పనుల పురోగతని పరిశీలించిన చంద్రబాబు.. వివిధ దశల్లో ఉన్న ప్రాజెక్టు పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే పైకి చేరుకున్నారు.. స్పిల్ వే 26వ గేట్ వద్ద పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు.. ఇక, ప్రాజెక్టు పనులను పరిశీలించిన తర్వాత మధ్యాహ్నం 2. 05 గంటల నుండి 3.05 గంటల వరకు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు ఏపీ సీఎం.. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడననున్నారు.

Read Also: Train Accident : బాలాసోర్ రైలు ప్రమాదాన్ని గుర్తుచేస్తున్న కంచన్‌జంగా ప్రమాదం

మరోవైపు 31-05-2024 నాటికి పోలవరం ప్రాజెక్టు వర్క్ ప్రోగ్రెస్ చూస్తే.. హెడ్ వర్క్స్-72.63శాతం, రైట్ మెయిన్ కెనాల్-92.75 శాతం, లెఫ్ట్ మెయిన్ కెనాల్-73.07 శాతం, భూసేకరణ-పునరావాసం-22.55 శాతం, ప్రాజెక్టులో అన్ని పనులు కలిపి 49.79 శాతం పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు.. మెయిన్ డ్యాం ప్యాకేజ్‌లో 1. స్పిల్ వే అండ్ రేడియల్ గేట్లు పనులు పూర్తి, 2. ఎగువ, దిగువ కాఫర్ ఢ్యాంలు-రెండూ పూర్తయ్యాయి.. 3. ఈసీఆర్ఎఫ్ ఢ్యాం(ఎర్త్‌ కం రాక్ ఫిల్ ఢ్యాం), గ్యాప్-1: ఢయాప్రం వాల్ నిర్మాణం పూర్తి అయింది. నేలను గట్టిపరిచే పనులు జరుగుతున్నాయి. గ్యాప్-2 : నేలను గట్టిపరిచే పనులు జరుగుతున్నాయి. ఢయా ఫ్రం వాల్ రిపేర్ల పనులు మొదలయ్యాయి. గ్యాప్-3 : కాంక్రీట్ ఢ్యాం నిర్మాణ పనులు పూర్తయ్యాయంటున్నారు. స్పిల్ ఛానెల్-88శాతం పనులు పూర్తయ్యాయి. అప్రోచ్ ఛానెల్-79శాతం పనులు పూర్తి. ఫైలెట్ ఛానెల్-48 శాతం పనులు పూర్తి.. రైట్ అండ్ లెఫ్ట్ కనెక్టివిటీస్-68 శాతం పనులు పూర్తి చేసినట్టు సమాచారం.. ఇక, చంద్రబాబు పర్యటనకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం.. కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..