NTV Telugu Site icon

CM Chandrababu Delhi Tour: ఢిల్లీలో చంద్రబాబు బిజీబిజీ.. నేటి షెడ్యూల్‌ ఇదే..

Chandrababu Delhi

Chandrababu Delhi

CM Chandrababu Delhi Tour: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఢిల్లీలో పర్యటిస్తున్న నారా చంద్రబాబు నాయుడు బిజీ బిజీగా గడుపుతున్నారు.. రెండో రోజు పర్యటనలో భాగంగా.. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్‌షా, నితిన్‌ గడ్కరీ.. ఇలా పలువురు కేంద్ర మంత్రులను కలిసి చంద్రబాబు.. మూడో రోజు కూడా మరికొందరితో సమావేశం కాబోతున్నారు.. ఈ రోజు ఉదయం 9 గంటలకు నీతి అయోగ్ సీఈఓతో సమావేశం కానున్నారు ఏపీ సీఎం చంద్రబాబు.. ఇక, ఉదయం 10 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీకానున్నారు.. ఉదయం 10.45 గంటలకు జేపీ నడ్డాతో సమావేశం కాబోతున్నారు.. మరోవైపు.. ఉదయం 11.30 గంటలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ కానున్నారు సీఎం చంద్రబాబు.. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్‌ అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లనున్నారు సీఎం..

Read Also: Astrology: జులై 05, శుక్రవారం దినఫలాలు

ఇక, ఇవాళ్టితో సీఎం చంద్రబాబు మూడు రోజుల ఢిల్లీ పర్యటన ముగియనుంది.. ఈ రోజు సాయంత్రం ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్‌ చేరుకోనున్నారు చంద్రబాబు.. రేపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి-ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కానున్న విషయం విదితమే.. కాగా, గురువారం రోజు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్, నితిన్‌ గడ్కరీ, శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, హోం మంత్రి అమిత్‌ షాతో విడివిడిగా సమావేశమైన చంద్రబాబు.. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు వేగంగా పూర్తిచేయడం, అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌వే, రహదారుల మరమ్మతులు, పట్టణ, గ్రామీణ పేదల ఇళ్లు, ఇంటింటికీ తాగునీరు వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు సీఎం చంద్రబాబు నాయుడు.