NTV Telugu Site icon

CM Chandrababu: పదవులను బాధ్యతగా భావించాలి.. నామినేటెడ్ పదవులు పొందిన వారికి సీఎం సూచన

Chandrababu

Chandrababu

CM Chandrababu: నామినేటెడ్ పదవులు పొందిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. పదవులను బాధ్యతగా భావించి ప్రజల కోసం నాయకులు పనిచేయాలని వారికి సూచించారు. పోరాటం, కష్టం, త్యాగం, పనితీరు, విధేయత, క్రమశిక్షణ ఆధారంగా పదవులు ఇచ్చామని వెల్లడించారు. 30 వేల దరఖాస్తులు పరిశీలించి… తగిన వ్యక్తికి తగిన గౌరవం విధానంతో అవకాశం కల్పించామన్నారు. వేధింపులకు గురైన వారికి, మహిళలు, యువతకు అవకాశాలు.. సమర్థత చాటిన బూత్ స్థాయి కార్యకర్తలకు రాష్ట్ర స్థాయి పదవులు ఇచ్చామన్నారు.

Read Also: Amaravathi: అమరావతి కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ఇచ్చే నిధుల వినియోగంపై ప్రభుత్వం ఉత్తర్వులు

పొలిటికల్ గవర్నెన్స్‌లో భాగంగా ఎంపికలు జరిగాయని.. పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. నామినేటెడ్ పదవులు పొందిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. నామినేటెడ్ పదవుల మొదటి లిస్టులో 20 ఛైర్మన్ పోస్టులు, ఒక వైస్ ఛైర్మన్ పోస్టును ప్రభుత్వం భర్తీ చేసింది. రెండో లిస్టులో ఏకంగా 62 మందికి ఛైర్మన్ పదవులు, సలహాదారు పదవులు కట్టబెట్టిందన్నారు. 60 రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులు కాగా… క్యాబినెట్ హోదాతో రెండు సలహాదారు పోస్టులు ఉన్నాయని చంద్రబాబు పేర్కొన్నారు.