NTV Telugu Site icon

Vijayawada: కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి.. పరిహారం ప్రకటించిన సీఎం

Vijayawada

Vijayawada

Vijayawada: విజయవాడలో భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. భారీ వర్షాలతో విజయవాడలోని మొగల్రాజపురంలో ఇళ్లపై కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడిన ఘటనలో నలుగురు మృతి చెందారు. కొండచరియలు విరిగి నలుగురు మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మేఘన, బోలెం లక్ష్మి, లాలు, అన్నపూర్ణ అనే నలుగురు ప్రాణాలు విడిచినట్లు తెలిసింది. సహాయక చర్యలపై అధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ మేరకు మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉన్న చోట స్థానికులను సురక్షిత ప్రదేశాలకు తరలించే కసరత్తు చేయాలని అధికారులన ఆదేశించారు.

Read Also: Botsa Satyanarayana: గుడ్లవల్లేరు కాలేజ్ ఘటనపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు?

 

Show comments