NTV Telugu Site icon

CM Chandrababu: గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం.. రూ.45,300 కోట్లతో నాలుగు గ్రీన్‌ఫీల్డ్‌ హైవేలు!

Chandrababu

Chandrababu

CM Chandrababu: నాలుగు గ్రీన్‌ఫీల్డ్‌ హైవేలకు 45,300 కోట్లు అవసరమని.. ఈ పనులు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఆరు ప్రాజెక్టులు బిడ్డింగ్ దశలో ఉన్నాయన్నారు. 18వేల కోట్లతో పనులు ముందుగా పూర్తి చేస్తారని.. హైదరాబాదు నుంచీ మచిలీపట్నం కనెక్ట్ చేసేలా గ్రీన్ ఫీల్డ్ హైవే వస్తుందన్నారు. జాతీయ రహదారుల అధికారులు, ఏజెన్సీలతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించామని చెప్పారు. రాష్ట్రంలో 15 ప్రాజెక్టులు నిలిచిపోయాయని.. 70 ప్రాజెక్టులకు భూసేకరణ సమస్యలు, 21 ప్రాజెక్టులకు అటవీ భూముల సమస్యలు, 3 ప్రాజెక్టులకు టోల్‌ప్లాజా సమస్యలు ఉన్నాయని చెప్పారు. ఇవన్నీ మూడు నెలల్లో సరిచేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో చేపట్టబోయే ప్రాజెక్టులన్నింటికీ 3 నెలల్లో భూసేకరణ పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రణస్ధలం నుంచీ శ్రీకాకుళం హైవే ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఎన్‌హెచ్‌-42లో పాడేరు బైపాస్, బైరెడ్డిపల్లి నుంచీ వి.కోట, బెంగళూరు హైవే విషయంలోనూ చర్చించామన్నారు.

Read Also: Aswini Vaishnaw: పవన్ చొరవతోనే రైల్వేలైన్‌కు మోడీ ఆమోదం.. రైల్వే మంత్రి కీలక వ్యాఖ్యలు

ఏపీకి మరో మూడు పోర్టులు వస్తాయని.. లాజిస్టిక్స్ హబ్‌గా ఏపీ తయారవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఆక్వా కల్చర్, హార్టికల్చర్ వల్ల ఎక్స్‌పోర్టులు పెరిగే అవకాశం ఉందన్నారు. రైల్వే లో 70వేల కోట్ల ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. గత ఐదేళ్ళలో చాలా పనులు ఆగిపోయాయని విమర్శించారు. లాజిస్టిక్స్ కనెక్టివిటీ పూర్తిగా ఆగిపోయిందన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇంకా ఎఫెక్టివ్ గా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. పరిటాల దగ్గర మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్కులు వస్తాయని చెప్పారు. 14 శాతం లాజిస్టిక్స్ కాస్ట్ ఇంటర్నేషనల్‌లో మనకు ఉంది… తగ్గిస్తామన్నారు. ఇసుక ప్రతీ సామాన్యుడికి అందించాలని ఉచిత ఇసుక విధాన తీసుకొచ్చామన్నారు. ఇసుక విధానంలో గత ప్రభుత్వంలో మోనోపోలీ తీసుకొచ్చారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వం సహజ వనరులను లూటీ చేశారని విమర్శించారు. ఇప్పుడు ఇసుక కావాల్సిన వాళ్ళే తవ్వుకుని తీసుకెళ్ళే అవకాశం ఉందన్నారు. అన్ని అంశాలను ట్రాక్‌లో పెడుతున్నామన్నారు.

 

Read Also: AP CM Chandrababu: అమరావతికి రైల్వే లైన్‌.. ప్రధానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కృతజ్ఞతలు

గత ఐదేళ్ళలో తప్పుడు కేసులు పెట్టడమే ధ్యేయంగా పెట్టుకున్నారని విమర్శించారు. మేం చేసే పనులు చూసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. 129 ప్రాజెక్టులు గురించి ఇవాళ చర్చించామని ముఖ్యమంత్రి వెల్లడించారు. గతంలో అమరావతి, పోలవరంను డ్యామేజీ చేశారని మండిపడ్డారు. పోలవరం ఒక లైఫ్ లైన్ అని.. ఆ లైఫ్ లైన్ చెరిపేసే పరిస్ధితిని గత ప్రభుత్వంలో తెచ్చారన్నారు. నదుల అనుసంధానం.. గోదావరి వంశధార, గోదావరి కృష్ణ, కృష్ణ పెన్న… ఇలా అనుసంధానం చేస్తే కరువు ఉండదన్నారు. నాలుగు నెలల్లో ఆలోచనా విధానంలో మార్పు తెచ్చామన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ కూడా తీసుకొస్తున్నామని.. దానిపై లోకేష్ ఆ కంపెనీలతో మాట్లాడుతున్నాడని చెప్పారు. విధ్వంసానికి చిరునామాగా ఉన్న ఏపీని అభివృద్ధికి చిరునామాగా చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో అమరావతి రైల్వే లైన్ మరింతగా పెంచుకోవాల్సి వస్తుందన్నారు. మిగిలిన రైళ్ళు కూడా వస్తే.. అన్నిరకాల అభివృద్ధి వస్తుందన్నారు. వందేభారత్ తరువాత బుల్లెట్ ట్రైన్ కూడా వస్తుందని చెప్పారు. అమరావతి, హైదరాబాదు, బెంగళూరు, చెన్నై మధ్య గంటన్నరలో జర్నీ ఉంటుందని తెలిపారు. అమరావతి మిగిలిన సిటీలకు కేంద్రంగా ఉంటుందన్నారు. అమరావతి ని టచ్ చేయకుండా సౌత్ ఇండియాలో ప్రయాణించలేమన్నారు. అమరావతిని లాజిస్టిక్స్ హబ్‌గా అభివృద్ధి చేయవచ్చన్నారు. ఏదైనా ప్రభుత్వం గవర్నెన్స్ ఇచ్చేప్పుడు పారదర్శకత ఉండాలన్నారు. పబ్లిక్ పాలసీ కానీ పబ్లిక్ గవర్నెన్స్ పారదర్శకంగా ఉండాలన్నారు. గత ఐదేళ్ళ జీఓలు ఆన్ లైన్ లో పెడుతున్నామని చెప్పారు. డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఏంటి‌.. తల్లి, చెల్లి గొడవ అయితే మా గురించి మాట్లాడుతున్నాడని జగన్ గురించి సీఎం చంద్రబాబు విమర్శించారు. తల్లి పై కేసులు పెట్టి మా గురించి మాట్లాడుతున్నాడని ఆరోపించారు.