Site icon NTV Telugu

AP Fiber Grid Case: ఫైబర్‌ గ్రిడ్‌ కేసులో సీఐడీ దూకుడు.. చంద్రబాబు సన్నిహితుల ఆస్తుల అటాచ్‌కి నిర్ణయం..

Cid

Cid

AP Fiber Grid Case: ఫైబర్ గ్రిడ్ కేసులో ఏపీ సీఐడీ అధికారులు దూకుడు చూపిస్తున్నారు.. ఈ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు సన్నిహితులకు చెందిన స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌ చేయడానికి కీలక నిర్ణయం తీసుకున్నారు.. చంద్రబాబు సన్నిహితులకు చెందిన ఏడు స్థిరాస్తులను అటాచ్‌ చేయాలంటూ.. హోంశాఖు ప్రతిపాదనలు పంపగా.. సీఐడీ అధికారుల ప్రతిపాదనకు హోంశాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.. దీంతో, ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో అనుమతి కోసం ఈ రోజు సీఐడీ అధికారులు పిటిషన్‌ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు.. టెరాసాఫ్ట్‌ కంపెనీ, చంద్రబాబు సన్నిహితులకు చెందిన ఏడు ఆస్తులకు అటాచ్ మెంట్ కు నిర్ణయం తీసుకున్న సీఐడీ అధికారులు.. ఆ ప్రతిపాదనలు రాష్ట్ర హోంశాఖకు పంపి ఆమోదింప జేసుకుంది.. దీంతో.. ఈ కేసులో మరింత దూకుడు చూపించినట్టు అవుతుంది..

Also Read: Bigg Boss 7 Telugu: తేజ వల్ల భాధపడిన శోభా..టాస్క్ లో పోటాపోటీగా ఆడిన రెండు టీమ్స్..

ఇక, సీఐడీ అధికారులు అటాచ్‌మెంట్‌కు సిద్ధమైన ఆస్తులను ఓ సారి పరిశీలిస్తే.. గుంటూరులో ఇంటి స్థలం, విశాఖపట్నంలో ఓ ఫ్లాట్, హైదరాబాద్‌లో 4 ఫ్లాట్లు, రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి.. తదితర ఆస్తుల అటాచ్‌మెంట్‌కు హోంశాఖ ఉత్తర్వుల జారీ చేసిన నేపథ్యంలో.. ఆ స్థిరాస్తులను అటాచ్‌మెంట్‌కు అనుమతించాలని కోరుతూ సీఐడీ అధికారులు ఇవాళ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్‌ను దాఖలు చేయనున్నారు. మరి సీఐడీ పిటిషన్‌పై ఏసీబీ న్యాయస్థానం ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.. కాగా, ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌ కేసులో అరెస్ట్‌ అయిని.. 53 రోజుల పాటు రిమాండ్‌లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు.. ఈ మధ్యే విడుదల అయిన విషయం తెలిసిందే కాగా.. ఫైబర్‌ గ్రిడ్‌ కేసులోనూ చంద్రబాబు పేరును సీఐడీ అధికారులు చేర్చిన విషయం విదితమే.

Exit mobile version