Election Commission: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం జరిగిన ఎన్నికల్లో మా అంచనా ప్రకారం 81 శాతం మేర పోలింగ్ నమోదు కావచ్చు అని ఏపీ సీఈఓ ముకేశ్ కుమార్ మీనా అన్నారు. 1.2 శాతం పోస్టల్ బ్యాలెటుతో కలుపుకుని ఇప్పటి వరకు సుమారుగా 79. 40 శాతం నమోదైనట్టు చెప్పొచ్చు.. నేటి సాయంత్రానికి పూర్తి వివరాలు వస్తాయి.. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో అర్థ రాత్రి 2 గంటల వరకూ పోలింగ్ జరిగింది అని ఆయన వెల్లడించారు. 2019 ఎన్నికల్లో 79.2 శాతం పోలింగ్ నమోదైంది.. కానీ, ఈసారి 0.6 శాతం పోస్టల్ బ్యాలెట్ తో కలిపి మొత్తం 79.8 శాతం నమోదు అయింది. ఈ ఎన్నికల్లో అర్థ రాత్రి 12 గంటల వరకూ 78. 25 శాతం పోలింగ్ నమోదైనట్లు అంచనా వేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎంకే మీనా తెలిపారు.
Read Also: Shawarma Side Effects : బయట దొరికే షవర్మాను ఎక్కువగా తింటున్నారా? ఇది తప్పక తెలుసుకోండి..
ఇక, నిన్న ఏపీలో పలు చోట్ల జరిగిన దాడులపై సీఈఓ ముకేష్ కుమార్ మీనా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పలు జిల్లాలో జరిగిన దాడులపై పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యుతలపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎక్కడ కూడా రీ- పోలింగ్ నిర్వహించే అవకాశం అయితే రాలేదు.. పూర్తి వివరాలు సేకరించిన తర్వాత మరింత సమాచారం అందిస్తామని ఆయన వెల్లడించారు.