Site icon NTV Telugu

AP Census 2027: ఏపీలో సెన్సస్ 2027కు శ్రీకారం.. రేపటి నుంచి హౌస్ లిస్టింగ్ ప్రారంభం.!

Ap Census 2027

Ap Census 2027

AP Census 2027: ఆంధ్రప్రదేశ్‌లో సెన్సస్-2027 ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుందని సెన్సస్ డైరెక్టర్ నివాస్ తెలిపారు. 1948 సెన్సస్ చట్టం ప్రకారం ఈ జనగణన నిర్వహించబడుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రణాళికలకు సెన్సస్ ముఖ్యమైన ఆధారం కావడంతో ఈ ప్రక్రియకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ప్రస్తుతం నిర్వహించబడుతున్నది దేశంలో 16వ సెన్సస్ కాగా, స్వాతంత్ర్యం తర్వాత ఇది 8వ సెన్సస్‌గా జరగనుంది.

Keesara BMW Accident Twist: కీసర BMW ప్రమాదం కేసులో ట్విస్ట్..! అసలు కారణం అదేనా..?

ఈ సెన్సస్ ప్రక్రియ రెండు విడతల్లో జరుగుతుంది. మొదటి విడతగా రేపటి నుంచి హౌస్ లిస్టింగ్ ప్రారంభమవుతుంది. రెండో విడతలో జనాభా గణన ఫిబ్రవరిలో చేపడతారు. హౌస్ లిస్టింగ్ సమయంలో ప్రతి ఇంటికి ప్రత్యేక సెన్సస్ హౌస్ నంబర్ ఇవ్వబడుతుంది. అలాగే ప్రతి భవనానికి బిల్డింగ్ నంబర్ కేటాయించి, అది కమర్షియల్ లేదా నాన్-కమర్షియల్ కేటగిరీకి చెందినదో నమోదు చేస్తారు. ఈ ప్రక్రియలో ఎన్యుమరేటర్లు ప్రజల నుంచి వివిధ వివరాలు సేకరిస్తారు. ఇల్లు ఎలా నిర్మించబడింది.? ఏ మెటీరియల్ ఉపయోగించారు.? అది నివాసయోగ్యంగా ఉందా.? లేదా.? వంటి ప్రశ్నలు అడుగుతారు. ఇంట్లో ఎంత మంది ఉంటున్నారు.? అనే వివరాలతో పాటు, కుటుంబంలో ముఖ్య నిర్ణయాలు తీసుకునే వ్యక్తి వివరాలు మాత్రమే నమోదు చేస్తారు.

వీటితోపాటు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సంబంధించిన వివరాలు, తాగునీటి వసతులు, వివాహిత/అవివాహిత స్థితి, లైటింగ్ సదుపాయాలు, టీవీ, ఇంటర్నెట్, మొబైల్ వినియోగం, కార్లు లేదా జీప్‌ల వంటి వాహనాల వివరాలు కూడా సేకరిస్తారు. కుటుంబ సభ్యులు తీసుకునే ఆహారపు అలవాట్లపై కూడా ప్రశ్నలు ఉంటాయి. ఈసారి సెన్సస్ పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించబడుతుంది. అయితే అవసరమైతే ఆఫ్‌లైన్ ద్వారా కూడా వివరాలు అందించవచ్చు. సెన్సస్ కోసం ప్రత్యేక యాప్‌ ను ఇప్పటికే ప్రీ-టెస్ట్ చేశారు. అలాగే జియో-రిఫరెన్స్ విధానాన్ని కూడా అమలు చేస్తున్నారు. దీని ద్వారా ప్రతి ప్రాంతంలోని ఇళ్లను ఖచ్చితంగా గుర్తించగలుగుతారు. ప్రతి బ్లాక్‌కు ఒక ఎన్యుమరేటర్‌ను నియమించారు.

Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

ప్రజలు తమ వివరాలను స్వయంగా కూడా నమోదు చేసి పంపే అవకాశం ఉంది. ఇందుకోసం అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అయి సమాచారం అందించవచ్చు. డేటా భద్రతకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. సర్వర్ హ్యాకింగ్ లేదా డేటా లీక్ జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అధికారులతో పాటు ప్రజల సహకారం కూడా సెన్సస్ విజయవంతానికి కీలకం. ఎన్యుమరేటర్లకు సహకరించడం ప్రతి పౌరుడి బాధ్యత. ఈ ప్రక్రియకు ఆటంకాలు కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Exit mobile version