NTV Telugu Site icon

AP Cabinet: నేడు ఏపీ కేబినెట్‌ భేటీ.. అజెండా ఇదే..!

Ys Jagan

Ys Jagan

AP Cabinet: ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశం జరగనుంది.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సచివాలయంలో జరగనున్న మంత్రి మండలి సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ సాగనున్నట్టు తెలుస్తోంది.. కేబినెట్‌ సమావేశంలో డీఎస్సీ నోటిఫికేషన్ పై చర్చించి.. టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహించేందుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.. వైఎస్సార్ చేయూత నాలుగో విడతకు ఆమోదం తెలపనుంది కేబినెట్‌.. ఫిబ్రవరిలో వైఎస్సార్ చేయూత నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది.. ఇక, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 5 వేల కోట్ల మేర నిధుల విడుదలకు ఏపీ కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వబోతోంది.. తాజాగా, ఎస్ఐపీబీ ఆమోదించిన తీర్మానాలను మంత్రిమండలి ఆమోదముద్ర వేసే అవకాశాలు ఉన్నాయి.. మరోవైపు.. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తుందనే చర్చ సాగుతోన్న నేపథ్యంలో.. 2024–25వ ఆర్థిక సంవత్సరానికిగాను ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు సిద్ధం అవుతోంది ఏపీ ప్రభుత్వం.. ఇవాళ్టి నుంచి పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కానుండగా.. రేపు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌.. పార్లమెంట్‌లో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు.. ఈ నేథప్యంలో.. బడ్జెట్‌ సమావేశాల తేదీలను ఏపీ కేబినెట్‌ సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉందంటున్నారు..

Read Also: Tea Side Effects: టీ ఎక్కువగా తాగితే వృద్ధాప్యం వచ్చేస్తుంది..

మరోవైపు, విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది.. ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ ఐబీ సిలబస్ తీసుకురానున్నారు.. రాష్ట్ర ప్రభుత్వ SCERTతో అంతర్జాతీయ విద్యా బోర్డు IB భాగస్వామ్యం కాబోతోంది.. దీనికి సంబంధించి ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో ఒప్పందం జరగనుంది.. ఈ రోజు ఉదయం 10 గంటలకు అంతర్జాతీయ విద్యా బోర్డుతో రాష్ట్ర ప్రభుత్వ ఎస్‌సీఈఆర్‌టీ (SCERT) ఒప్పందం చేసుకోబోతోంది.. 2025 విద్యా సంవత్సరం నుంచి ఐబీ సిలబస్ లో విద్యా బోధన ప్రారంభించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.. 2025 జూన్ లో ఒకటవ తరగతికి IBలో విద్యాబోధన చేపట్టనున్నారు.. ఇక, జూన్ 2026 నుండి రెండో తరగతికి IBలో విద్యాబోధన అందించేవిధంగా ప్లాన్‌ చేస్తున్నారు.. క్రమంగా ఒక్కో ఏడాది ఒక్కో తరగతికి పెంచుతూ 2035 నాటికి 10వ తరగతికి ఐబీ సిలబస్ అందించనుంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఇలా 2037 నాటికి 12వ తరగతి వరకు ఐబీ సిలబస్ ప్రారంభించనున్నారు.. అంతేకాకుండా.. విద్యార్థులకు ఐబీ, రాష్ట్ర బోర్డుల జాయింట్ సర్టిఫికేషన్ అందించనున్నారు.